సాధారణంగా తమ అభిమాన హీరో సినిమా విడుదల అవుతుందంటే ఫ్యాన్స్ కి పండగే. థియేటర్ల ముందు అభిమానులు ఓ రేంజ్ లో సందండి చేస్తుంటారు. ఇక థియేటర్ లో స్క్రీన్ పై తమ అభిమాన హీరో కనిపించినప్పుడు ఫ్యాన్స్ చేసే రచ్చ మాములుగా ఉండదు. కొన్ని సందర్భాల్లో అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటారు. దీనికి కారణంగా ప్రాణ, ఆస్తి నష్టాలు కూడా జరుగుతుంటాయి. తాజాగా “విక్రమ్” సినిమా విషయంలోను అలాంటి ఘటన ఒకటి చోటుచేసుకుంది. అభిమానులు అత్యత్సాహం కారణంగా ఓ థియేటర్ లోని స్క్రీన్ అగ్నికి ఆహుతి అయింది. ఈఘటన పుదుచ్చేరిలోని ఓ థియేటర్ లో జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
సౌత్‌లో ఇప్పుడు బాగా మార్మోగిపోతున్న సినిమా విక్రమ్. కమల్ హాసన్, ఫాహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో సూర్య అతిథి పాత్రలో మెరిశాడు. నలుగురు హీరోలను ఒకే సినిమాలో చూసి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఆల్ రెడి ఈ సినిమా చూసినవారు సైతం మళ్లీ చూడటానికి థియేటర్ వైపు అడుగులు వేస్తున్నారు. విక్రమ్ సినిమాలో సూర్య చిన్న పాత్రలో కనిపించడంతో ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈక్రమంలో ఆయన అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. పుదుచ్చేరిలోని ఓ థియేటర్ లో విక్రమ్ సినిమా ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలో స్క్రీన్ మీద సూర్య కనబడగానే ఆయన అభిమానలు టపాకాయలు పేల్చారు. దీంతో ఒక్కసారిగా మంటలు ఎగసిపడి తెరకు అంటుకున్నాయి.
ఇదీ చదవండి: ప్రైవేట్ పార్ట్స్ ఫొటోలు.. పిచ్చి పిచ్చి కామెంట్లు! సింగర్ చిన్మయి ఆవేదన!ఈ క్రమంలో సినిమా రన్ అవుతుండగానే స్క్రీన్ మొత్తం కాలిపోయింది. థియేటర్ లో మంటలు ఎగసిపడటం తో ప్రేక్షకులు భయంతో బయటకి పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే అభిమానుల అత్యుత్సహం కారణంగానే థియేటర్ స్క్రీన్ తగలబడిపోయిందని కొందర అంటుంటే.. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకున్నాయి మరికొందరు తెలిపారు. థియేటర్ స్క్రీన్ కాలిపోతున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Real திரை தீப்பிடித்த தருணம்#DinakaranNews| #Pondicherry | #Theatre | #Vikram | #Surya | #RolexSir | #Rolex pic.twitter.com/t1x3R16fIb
— Dinakaran (@DinakaranNews) June 8, 2022