ప్రముఖ తమిళ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ఇంటి వద్ద పోలీసుల భద్రత ఏర్పాటైంది. ఆమెపై దాడి జరిగే అవకాశం ఉందన్న కారణంగా ఇంటి వద్ద భద్రత ఏర్పాటైంది.
దర్శకుడు నెల్సన్ వెంకటేష్ దర్శకత్వం వహించిన ‘ఫర్హానా’ సినిమా వివాదంలో చిక్కుకుంది. ఓ వర్గాన్ని కించపరిచేలా సినిమా ఉందంటూ విమర్శలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే సినిమాలో హీరోయిన్‌గా నటించిన ఐశ్వర్య రాజేష్ ఇబ్బందుల్లో పడ్డట్టయింది. ఆమెపై ఎప్పుడైనా దాడి జరిగే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్నాయి. దీంతో ఐశ్వర్య రాజేష్ ఇంటి వద్ద పోలీసుల భద్రత ఏర్పాటైంది. కొంతమంది పోలీసులు ఆమె ఇంటి వద్ద ఎలాంటి గొడవలు జరగకుండా చూసుకుంటున్నారు.
కాగా, ఫర్హానా సినిమాలో ఐశ్వర్య రాజేష్ ముస్లిం యువతిగా నటించారు. బుర్ఖా ధరించి ప్రపంచ వ్యాప్తంగా ప్రాస్టిట్యూషన్ నిర్వహించే పాత్రలో కనిపించారు. దీంతో సినిమా వివాదంలో చిక్కుకుంది. సదరు వర్గం ఈ సినిమాను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇక, ఫర్హానా సినిమా గురించి కొద్దిరోజుల క్రితం సినిమా టీం మాట్లాడుతూ.. ‘‘ కొంతమంది మాత్రమే ఫర్హానా సినిమాపై వివాదం చేస్తున్నారు. అది కూడా భారత సెన్సార్ బోర్డు అనుమతి తెలిపిన సినిమాపై వివాదం చేయటం బాధగా ఉంది. మా సినిమా ఏ మతానికి.. నమ్మకాలకు వ్యతిరేకం కాదు. ఓ మంచి సినిమా చేయాలన్నదే మా లక్ష్యం.
ఓ మతానికి వ్యతిరేకంగా మేము ఎప్పుడూ సినిమాలు చేయం. మానవత్వాన్ని చాటే సినిమాలే మేము చేస్తాము’’ అని పేర్కొంది. ఫర్హానా సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో సెల్వరాఘవన్, ఐశ్వర్య దత్త, జితిన్ రమేష్ తదితరులు కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా కూడా ‘ది కేరళ స్టోరీ’ సినిమాలాగే వివాదాల్లో పడిపోయింది. మరి, సినిమా కారణంగా ఇబ్బందుల్లో చిక్కుకున్న ‘ఫర్హానా’ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.