దేశవ్యాప్తంగా సినీ ఇండస్ట్రీతో పాటు అభిమానుల చూపంతా ‘RRR‘ సినిమాపైనే ఉంది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా మల్టీస్టారర్.. మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ కానున్న RRR మూవీకి సంబంధించి, తెలుగు రాష్ట్రాలలో టికెట్ ధరలు కూడా భారీగానే పెరగనున్నాయి. తాజాగా RRR సినిమా టికెట్ రేట్స్ పై కీలకవార్త బయటికి వచ్చింది.
తెలంగాణ(నైజాం)లో RRR సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో RRR టికెట్ ధరలు విడుదలైన మొదటి రెండు రోజులు ఒకలా, తర్వాత ఒకలా ఉండబోతున్నాయి. ఇక RRR ధరలు.. మార్చి 25 -27 వరకు సింగిల్ స్క్రీన్ రూ. 233/-, మల్టీప్లెక్స్ లో రూ. 413/- గా ఉండబోతున్నాయి. తర్వాత మార్చి 28 నుండి ఏప్రిల్ 3 వరకు.. సింగిల్ స్క్రీన్ రూ. 209/-, మల్టీప్లెక్స్ లో రూ. 354/- లుగా ఉండనున్నాయి.
ఇక ఎంతో ఆశగా RRR సినిమా రిలీజ్ కోసం ఎదురుచూసిన ఫ్యాన్స్.. ఇప్పుడు టికెట్ ధరలు చూసి అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ స్థాయిలో టికెట్ రేట్లు పెంచితే ఎలా అంటూ వాపోతున్నారు. దాదాపు వారంపాటు టికెట్ రేట్లు తెలంగాణలో ఈ స్థాయిలో అమలు చేయడం గమనార్హం. ఇప్పటికే ఈ సినిమా పై అంచనాలు తారాస్థాయిలో నెలకొన్నాయి. మరోవైపు RRR టికెట్ రేట్లు అభిమానులకు షాకిస్తున్నాయి. మరి RRR టికెట్ రేట్లపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
#RRRMovie Nizam Ticket Cap
25.03.2022 to 27.03.2022
Single screen – 233/-
Plex – 413/-28.03.2022 to 03.04.2022
Single screen – 209/-
Plex – 354/-Pricing is fine in Single Screens but multiplex seems ridiculous pic.twitter.com/OoXzsADgua
— telugu360_BO (@Telugu360_BO) March 19, 2022