సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెంచుకునేందుకు గ్లామర్ షో చేయడం ఈమధ్య ఎక్కువైపోయింది. ముఖ్యంగా అప్‌కమింగ్ యాక్టర్స్ ఇలాంటివి ఎక్కువగా చేస్తున్నారు. వీరితో పాటు కొందరు హీరోయిన్లు కూడా గ్లామర్ షోకు తెరలేపుతున్నారు. హాట్ హాట్ స్కిన్ షో ఫొటోలు, వీడియోలను ఇన్స్టాగ్రామ్ అకౌంట్లలో పోస్టులు చేస్తూ కుర్రకారు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెంచుకోవడంతో పాటు చిత్ర పరిశ్రమలో అవకాశాలు చేజిక్కించుకునేందుకే తారలు అందాలు ప్రదర్శన చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వీళ్లు పోస్ట్ చేసే ఫోటో షూట్లకు సంబంధించిన ఫోటోలకు నెటిజన్స్ నుంచి మంచి స్పందన లభిస్తుండటం గమనార్హం.
ఇకపోతే, సోషల్ మీడియా సెన్సేషన్ అషు రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. బుల్లితెర ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చిన అషు రెడ్డి.. ఆపై ప్రముఖ టెలివిజన్ షో ‘బిగ్‌బాస్’తో ఓవర్‌నైట్ పాపులారిటీ సంపాదించారు. స్టన్నింగ్ లుక్స్‌తో ఎంతోమంది అభిమానాన్ని ఆమె సొంతం చేసుకున్నారు. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో కలసి అషు రెడ్డి ఈమధ్య చేసిన ఓ ఇంటర్వ్యూ బాగా వైరల్ అయింది. దీంతో ఆమె క్రేజ్ మరింత పెరిగింది. అయితే ఆ ఇంటర్వ్యూలో అషు, ఆర్జీవీ హద్దుమీరారనే కామెంట్స్ వినిపించాయి. తన అందాలను ఆమె అతిగా ఎక్స్పోజ్ చేశారని.. ఇది సరికాదంటూ కొందరు నెటిజన్స్ ఆమెకు సూచించారు. ఇక, ప్రస్తుతం సినిమాల్లో ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్న అషు.. తాజాగా ఇన్‌స్టాలో ఓ ఫోటో పోస్ట్ చేశారు.
ఇన్స్టాగ్రామ్ పోస్టులో షార్ట్ జీన్స్ వేసుకుని, కాళ్లకు రెడ్ కలర్ షూస్‌తో అషు ఇచ్చిన పోజ్‌కు ఆమె అభిమానులు వహ్వా అంటున్నారు. థైస్ చూపిస్తూ కుర్రకారును రెచ్చగొట్టేందుకు అషు ప్రయత్నిస్తున్నట్లుగా ఉందీ ఫొటో. పోస్ట్ చేసిన కొద్ది నిమిషాల్లోనే ఈ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. హీరోయిన్‌కు కావాల్సిన అందచందాలు అషులో ఉన్నాయని కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి.. ఫోటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న అషు రెడ్డిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.