ప్రముఖ సింగర్ వాణీ జయరామ్ గురించి సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆమె తన గాత్రంతో శ్రోతలను మైమరిపించేలా చేశారు. ఆమె పాట పాడితే.. చెవుల్లో అమృతం పోసినట్లు ఉంటుంది. భక్తి, సంగీత, కమర్షియల్.. ఇలా అన్ని రకాల పాటలతో ప్రేక్షకులను అలరించారు వాణీ జయరామ్. ఇంతలా అందరిని అలరించిన వాణీ జయరామ్ రెండు రోజుల క్రితం అనుమానాస్పద పరిస్థితుల్లో చెన్నైలోని నుంగంబాక్కం ప్రాంతంలోని తన నివాసంలో మృతి చెందారు. అందరు ఆమె వయసు కూడా ఎక్కువ కావడంతో.. వృద్ధాప్యం వల్ల చనిపోయి ఉండవచ్చు అని అందరూ భావించారు. కానీ ఆమె ముఖంపై గాయాలు ఉండటంతో అందరిలో అనుమానాలు వ్యక్తమయ్యాయి. తాజాగా ఈ అనుమానాలకు తెరపడింది. ఫోరెనిక్స్ అధికారులు వాణీ జయరామ్ మృతిపై కీలక విషయాలను వెల్లడించారు.
రెండు రోజుల క్రితం వాణీ జయరామ్ మరణించిన సంగతి తెలిసిందే. ఆ వార్తలు వచ్చిన సమయంలో అందరూ వృద్ధాప్యం కారణంగా ఆమె చనిపోయినట్లు భావించారు. కాస్త సమయం తరువాత ఆమె ముఖంపై గాయాలు కనిపించడంతో మృతిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఈక్రమంలో ఫోరెన్సిక్ అధికారులు ఘటన స్థలానికి చేరుకుని కీలక ఆధారాలు సేకరించారు. ఇదే సమయంలో ఆమెది సహజ మరణమా? లేక హత్యనా? అనే అనుమానాలు కలిగాయి. అయితే తాజాగా వాణీజయరామ్ మృతిపై ఫోరెన్సిక్ నివేదికను పోలీసులు వెల్లడించారు. వాణీ జయరామ్.. తన బెడ్రూమ్ లో ఉన్న అద్దంతో కూడిన టీపాయ్ పై పడటంతో ఆమె తలకు బలంగా దెబ్బ తగిలిందని అధికారులు తెలిపారు.
బలమైన దెబ్బ తగలడం వల్ల వాణీ జయరామ్ మృతి చెందినట్లు ఫోరెన్సికి నివేదికలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. అదే విధంగా వాణీ జయరామ్ ఇంటి పరిసరాల్లోని సీసీ కెమెరాలను క్షుణంగా పరిశీలించామని, ఎక్కడా అనుమానాస్పద వ్యక్తులు, కదలికలు కనిపించలేదని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో ఆమె మృతిపై ఎలాంటి సందేహాలు, అనుమానాలు లేవని పోలీసులు తెలిపారు. వాణీ జయరామ్ మృతిపై విచారణ అనంతరం ఆమెది సహజ మరణ మేనని పోలీసులు ధ్రువీకరించారు.
ఇక వాణీ జయరామ్ మృతి నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో ఆమెకు అంత్యక్రియలు నిర్వహించింది. చెన్నైలోని బేసంట్‌నగర్ శ్మశాన వాటికలో.. ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. అంతకుముందే తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ వాణీ జయరాం పార్థివదేహానికి నివాళులర్పించారు. తాజాగా వాణీ జరామ్ మృతిపై విడుదలైన ఫోరెన్సికి నివేదిక పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.