తమిళ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ తమిళ హాస్య నటి రంగమ్మ పట్టి తాజాగా కన్నుమూశారు. ఏప్రిల్ 29న కోయంబత్తూరులో 83 ఏళ్ల వయసులో ఆమె మరణించారు. అయితే ఆమె గత కొన్ని నెలలుగా వయస్సు సంబంధిత అనారోగ్యంతో బాధపడినట్లు తెలుస్తోంది. ప్రముఖ హాస్యనటులు వడివేలు, వివేక్‌లతో తరచుగా చిత్రాలలో రంగమ్మ పట్టి కనిపించేవారు.
ఇది కూడా చదవండి: Avatar-2: లీకైన అవతార్-2 ట్రైలర్! వీడియో వైరల్!
కోయంబత్తూరు జిల్లాలోని అన్నూర్ సమీపంలోని తెలుగుపాళయం గ్రామంలో ఆమె నివాసం ఉండేవారు. ఎంజీఆర్ నటించిన వివాహే సినిమా ద్వారా ఆమె తెరపైకి ఎంట్రీ ఇచ్చి అనేక సినిమాల్లో నటించారు. అయితే సీనియర్ నటుడు ఎంజీఆర్ కాలంలో ఆమె తన నటన జీవితాన్ని ప్రారంభించి తమిళ పరిశ్రమలో అజిత్, విజయ్, విశాల్, కమల్ హాసన్, రజనీకాంత్‌లతో సహా పలువురు ప్రముఖ నటులతో ఆమె కలిసి పనిచేశారు. ఇక ఉన్నట్టుండి ఆమె మరణించడంతో తమిళ సినీ అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. రంగమ్మ పట్టి మరణవార్త తెలియడంతో తమిళ నటీ నటులు ఆమెకు సంతాపం తెలియజేస్తున్నారు. రంగమ్మ పట్టి ఇప్పటికీ దాదాపుగా 1000 పైగా సినిమాల్లో నటించడం విశేషం.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.