సెలెబ్రిటీలు అంటే తమ కంటే ప్రత్యేకమైన వారని జనం భావిస్తూ ఉంటారు. సెలెబ్రిటీలు ఏమి చేసినా వింతగా చూస్తు ఉంటారు. వారు కూడా తమ లాంటి సామాన్య మనుషులే అని గుర్తించరు. సెలెబ్రిటీలు కూడా సామాన్య మనుషులే అని తెలిపే సంఘటనలు ఈ సమాజంలో చాలా జరుగుతున్నాయి. తాజాగా, కూడా ఓ సంఘటన చోటుచేసుకుంది. ఓ ప్రముఖ నటి 2 వేలకు కక్కుర్తి పడింది. ఓ రీటైల్ షాపులో బ్లౌజు దొంగతనం చేసి, పట్టుబడింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. అమెరికాకు చెందిన క్లోయి చెర్రీ నీలి చిత్రాలు, యుఫోరియా అనే టీవీ సిరీస్‌తో మంచి పాపులారిటీ తెచ్చుకుంది.
ఈమె కొద్దిరోజుల క్రితం పెన్సెల్వేనియాలోని లాన్‌కాస్టర్‌లోని ఓ రీటైల్ స్టోర్‌కు వెళ్లింది. అక్కడ షాపింగ్ చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఆమె దాదాపు 2 వేల రూపాయలు విలువ చేసే ఓ బ్లౌజును దొంగతనం చేసింది. అయితే, షాపు వారు దీన్ని గుర్తించారు. దాని గురించి అడగ్గా ఆమె నీళ్లు నమిలింది. దీంతో షాపు సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అక్కడికి వచ్చారు. ఆమెపై కేసు కూడా నమోదు చేశారు. అయితే, దీనిపై క్లోయి ప్రతినిధి స్పందించాడు. అది పొరపాటు వల్ల జరిగిందని, క్లోయికి అలాంటి ఉద్ధేశ్యం లేదని తెలిపాడు. షాపు వాళ్లు కావాలనే ఆమెపై బురద జల్లటానికి చూస్తున్నారని అన్నాడు.
కాగా, సెలెబ్రిటీలు దొంగతనం చేస్తూ పట్టుబడటం ఇదే మొదటిసారి కాదు. గతంలో వినోనా రైడర్ అనే ప్రముఖ నటి 5 వేల డాలర్ల డిజైనర్ ఐటమ్స్ దొంగిలించి పట్టుబడింది. దీంతో ఆమెపై పోలీస్ కేసు నమోదు అయింది. అంతేకాదు.. మూడేళ్ల పాటు ఆమె నిషేధానికి కూడా గురైంది. వీటితో పాటు పలు రకాల శిక్షలకు కూడా గురైంది. మరి, ఓ సినిమా సెలెబ్రిటీ బ్లౌజు దొంగతనం చేస్తూ పట్టుబడటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.