Esther Anil: సినీ ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్టులుగా ఎంట్రీ ఇస్తున్నవారు ఎంతోమంది ఉన్నారు. అలాగని వచ్చినవారంతా క్లిక్ అయిపోలేరు కదా.. కొందరు ఫస్ట్ మూవీకే సూపర్ క్రేజ్ దక్కించుకుని బిజీ అయిపోతారు. ఇంకొందరు ఎన్ని సినిమాలు చేసినా తగిన గుర్తింపు రాక కనిపించకుండా పోతుంటారు. అయితే.. తెలుగు ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా మొదటి సినిమాకే సొంతం చేసుకుంది ఎస్తేర్ అనిల్. కేరళకు చెందిన ఎస్తేర్.. తెలుగులో దృశ్యం మూవీతో ప్రేక్షకులకు దగ్గరైంది.
దృశ్యంలో వెంకటేష్ చిన్న కూతురుగా నటించి మెప్పించింది ఎస్తేర్. ఈ సినిమాలో అద్భుతమైన నటనను కనబరచడంతో.. నటిగా గుర్తింపుతో సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా విపరీతంగా పెంచుకుందనే చెప్పాలి. అయితే.. దృశ్యం మూవీ సమయంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించిన ఎస్తేర్.. ప్రస్తుతం 20 ఏళ్ళ అమ్మాయి. సోషల్ మీడియాలో సూపర్ క్రేజ్ సొంతం చేసుకొని బోల్డ్ ఫోటోషూట్స్ ద్వారా తన అందాలను బయట పెట్టేస్తోంది.
ఇక మొదటిసారిగా హీరోయిన్ గా జోహార్ అనే చిత్రంతో టాలీవుడ్ లో డెబ్యూ కూడా చేసింది ఎస్తేర్. అదీగాక ఈ మధ్య తాను నటిస్తున్న సినిమాలకు సంబంధించి ఫోటోలు, పోస్టర్ లను తన సోషల్ మీడియాలో అకౌంట్స్ లో షేర్ చేస్తూ బిజీ అవుతోంది. అయితే.. సెలబ్రిటీలన్నాక అపుడప్పుడు ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేస్తారనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తమకు సంబంధించి ఎన్నో పర్సనల్ విషయాలు సైతం బయట పెడుతుంటారు.
తాజాగా ఎస్తేరు కూడా తన ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేసి తన బాయ్ ఫ్రెండ్ ఎవరో చెప్పేసింది. చిట్ చాట్ లో భాగంగా ఓ నెటిజన్ నీ బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పవా? అని అడిగాడు. ఆ ప్రశ్నకు స్పందిస్తూ.. తనతో పాటు ఉన్న ఒక కుక్క పిల్ల ఫోటోని షేర్ చేసి.. ‘తనే నా బాయ్ ఫ్రెండ్’ అని రిప్లై ఇచ్చింది. దీంతో తనకు బాయ్ ఫ్రెండ్ లేడనే విషయాన్నీ చెప్పకనే చెప్పిందని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. మరి ఎస్తేర్ ఇచ్చిన ఆన్సర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.