హైదరాబాద్ సరూర్‌నగర్ విక్టోరియా మెమోరియల్ స్కూల్‌లో ఆర్సీ15 సినిమా షూటింగ్ జరుగుతుండగా.. బీజేపీ నాయకులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. స్థానిక బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి, బీజేపీ నాయకులతో కలిసి ఆందోళన చేపట్టారు. స్కూళ్ళు నడుస్తున్న సమయంలో షూటింగ్‌కు పర్మిషన్ ఎలా ఇచ్చారని బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి ప్రశ్నించారు. స్కూల్‌లో షూటింగ్ జరపడం వల్ల పిల్లలు కాన్సన్‌ట్రేషన్ దెబ్బతింటుందని, షూటింగ్ చూస్తూ చదువుపై ధ్యాస పెట్టలేరని ఆమె అన్నారు. విద్యాశాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తమ స్వలాభం కోసమే విద్యార్థుల జీవితాలను పణంగా పెట్టి సినిమా షూటింగ్‌కు అనుమతి ఇచ్చారని కార్పొరేటర్ శ్రీవాణి ఆరోపించారు. అనంతరం అక్కడ ఎటువంటి షూటింగ్‌లు జరగకుండా చూడాలని కలెక్టర్ ఆఫీసులో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై డీఆర్వో స్పందించారు. తక్షణమే షూటింగ్ నిలిపివేయాలని చిత్ర యూనిట్‌కు ఆర్డర్ వేశారు.
ఇది చదవండి: RC15 Movie Shooting: చరణ్ సినిమా షూటింగ్‌ను అడ్డుకున్న బీజేపీ నేతలు.. ఎందుకంటే?
ఇదిలా ఉంటే.. రామ్ చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీకి ‘అధికారి’ అనే టైటిల్ పెట్టినట్టు సమాచారం. కాగా ఈ మూవీలో చరణ్ ముఖ్యమంత్రిగా, ఎన్నికల అధికారిగా రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తారట. ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతున్న షూటింగ్‌ను నిలిపివేయాల్సిందిగా డీఆర్వో ఆర్డర్ ఇవ్వడంతో మూవీ యూనిట్‌కి కొత్త తలనొప్పి మొదలైంది. మరి దీనిపై మీ అభిప్రాయమేంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.