ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా ఎదిగిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ప్రస్తుతం లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే వైజాగ్ షెడ్యూల్లో చరణ్‌తో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించిన మూవీ యూనిట్.. తాజాగా హైదరాబాద్‌లో మరో షెడ్యూల్‌ని ప్రారంభించారు. అయితే సరూర్ నగర్లో విక్టోరియా మెమోరియల్ స్కూల్లో షూటింగ్ చేసేందుకు వెళ్ళిన చిత్ర బృందానికి ఊహించని షాక్ ఎదురైంది. బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి.. బీజేపీ నేతలతో కలిసి ధర్నాకు దిగారు. స్కూళ్ళు నడుస్తున్న సమయంలో షూటింగ్‌కు పర్మిషన్ ఎలా ఇచ్చారని బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి ప్రశ్నించారు. స్కూల్లో షూటింగ్ జరపడం వల్ల పిల్లలు కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుందని ఆమె అన్నారు. షూటింగ్ చూస్తూ చదువుపై ధ్యాస పెట్టలేరని ఆమె అన్నారు. విద్యాశాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తమ స్వలాభం కోసమే విద్యార్థుల జీవితాలను పణంగా పెట్టి సినిమా షూటింగ్‌కు అనుమతి ఇచ్చారని కార్పొరేటర్ శ్రీవాణి ఆరోపించారు. పిల్లల క్లాసులకు ఇబ్బందులు కలుగుతాయని షూటింగ్‌ను అడ్డుకోవడంతో మూవీ యూనిట్ షూటింగ్ నిలిపివేసి అక్కడ నుంచి వెళ్ళిపోయారు. మరోవైపు శంకర్ సినిమాలో చరణ్ పాత్రకి సంబంధించి సోషల్ మీడియాలో కొన్ని ఆసక్తికర విషయాలు చక్కెర్లు కొడుతున్నాయి. ఈ సినిమాలో చరణ్ డ్యుయెల్ రోల్ చేస్తున్నారని.. ఒక పాత్రలో యాంగ్రీ యంగ్ మేన్‌గా, మరో పాత్రలో పల్లెటూరి అబ్బాయిగా కనిపిస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ రెండు పాత్రల్లో చరణ్ వైవిధ్యమైన లుక్స్‌లో కనిపిస్తారని అంటున్నారు. కాగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీలో హీరోయిన్గా కియారా అద్వానీ నటిస్తుండగా.. అంజలి, శ్రీకాంత్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. థమన్ ఈ మూవీకి సంగీత సారథ్యం వహిస్తున్నారు. వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసి రిలీజ్ చేయాలని భావిస్తుంది చిత్ర యూనిట్. ఇందులో భాగంగానే హైదరాబాద్ షెడ్యూల్‌ను ఫాస్ట్‌గా ఫినిష్ చేయాలని భావించారు. అయితే ఊహించని విధంగా బీజేపీ కార్పొరేటర్ అడ్డుకోవడంతో షూటింగ్‌కు బ్రేక్ పడింది. మరి స్కూల్లో షూటింగ్ చేస్తున్న చిత్ర యూనిట్‌పై, అలానే షూటింగ్‌ను అడ్డుకున్న బీజేపీ కార్పొరేటర్‌పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: Jr NTR: వీడియో: లైవ్‌లో కళ్యాణ్ రామ్‌కి కాల్ చేసిన Jr ఎన్టీఆర్! ఇది కూడా చదవండి: Nandu: రణ్వీర్ బాటలో గీతా మాధురి భర్త.. ఒంటిపై అదొక్కటే అడ్డుగా పెట్టుకుని!