బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ ఏ నిమిషంలో న్యూడ్ ఫోటో షేర్ చేశాడో.. కానీ దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఇది ట్రెండింగ్‌లో నిలిచింది. ఈ ఫోటో షూట్‌పై దేశవ్యాప్తంగా విమర్శలు, ప్రశంసలు, వివాదాలు ఓ రేంజ్‌లో వస్తున్నాయి. తాజాగా ఈ న్యూడ్ ఫోటో షూట్ వివాదంలో రణ్‌వీర్‌పై కేసు నమోదు చేశారు. ఇక వివాదం, లీగల్ కేసులు ఎలా ఉన్నా కానీ.. ప్రస్తుతం ఈ న్యూడ్ ఫోటో షూట్ దేశవ్యాప్తంగా ట్రెండింగ్‌లో నిలిచింది. ఇప్పటికే కొందరు హీరోలు ఈ న్యూడ్ ఫోటో ట్రెండ్‌లో చేరారు. హీరో విష్ణు విశాల్ ఈ ట్రెండ్‌లో జాయిన్ అయ్యి.. అర్ధ నగ్న ఫోటోలు షేర్ చేసిన సంగతి తెలిసిందే. పైగా తన భార్యే ఆ ఫోటోలను తీసింది అని తెలిపాడు. తాజాగా ఈ జాబితాలో మరో టాలీవుడ్ నటుడు చేరాడు. రణ్‌వీర్ సింగ్ ట్రెండ్‌లో జాయిన్ అవుతున్నాను అంటూ న్యూడ్ ఫోటోలను షేర్ చేశాడు. ఆ వివరాలు.. తాజాగా ఈ న్యూడ్ ఫోటో షూట్ ట్రెండ్‌లో జాయిన్ అయ్యాడు సింగర్ గీతా మాధురి భర్త నందు. కేవలం టవల్ కట్టుకుని.. నిలబడి.. తన సిక్స్ ప్యాక్ బాడీని చూపిస్తూ.. తీసిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అంతేకాక రణ్‌వీర్ సింగ్ ట్రెండ్‌లో జాయిన్ అవుతున్నానని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. వీటిని చూసిన నెటిజనులు.. అన్న.. సిక్స్ బ్యాడీ చూపించడం కోసం ట్రెండ్ బాగా కలసివచ్చింది కదా.. మస్తు ట్రై చేశావ్.. సూపర్ ట్రాన్స్‌ఫర్‌మేషన్ అని కామెంట్స్ చేస్తుండగా.. మరి కొందరు నెటిజనులు మాత్రం మీకిదేం పోయే కాలం రా నాయనా అంటూ తిట్టి పోస్తున్నారు. ఇక 70వ దశకంలో పాప్ ఐకాన్ బర్ట్ రేనాల్డ్స్ కాస్మోపాలిటన్ మ్యాగజైన్ కోసం ఫోటోషూట్ చేసి అప్పట్లో సంచలనం రేపాడు. బర్ట్ రేనాడ్స్‌కు నివాళిలర్పించేందుకు కోసం రణ్‌వీర్ సింగ్ ఈ ఫోటోషూట్ చేశాడు. గోడకు బల్లిలా అతుక్కొని.. నేలను కరుచుకొని రణ్‌వీర్ ఫోటోలకు ఫోజిలిచ్చాడు. ఇక ఈ నగ్న షోటోషూట్ రణ్‌వీర్‌ని చట్టపరమైన చిక్కుల్లో పడేసింది. ఓ ఎన్జీఓ ఫిర్యాదు మేరకు రణ్‌వీర్ సింగ్‌పై ముంబైలో చెంబూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. మహిళల మనోభావాలను దెబ్బతీశారనే ఆరోపణలతో కేసు నమోదు చేశారు పోలీసులు. మరి ఈ న్యూడ్ ఫోటో షూట్ ట్రెండ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. View this post on Instagram A post shared by @that_actor_nandu ఇది కూడా చదవండి: Ranveer Singh: రణ్‌వీర్ సింగ్‌ను చిక్కులోల పడేసిన న్యూడ్ ఫోటో షూట్.. కేసు నమోదు! ఇది కూడా చదవండి: న్యూడ్ ఫోటోలతో మరో స్టార్ హీరో.. ఫోటోగ్రాఫర్ గా మారిన భార్య!