నందమూరి నట వారసులు కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్‌ల మధ్య మంచి అనుబంధం ఉంది. అన్నదమ్ములిద్దరి మధ్య గాఢమైన బంధం ఉంది. పలు సందర్భాల్లో వీరిద్దరు తమకు ఒకరంటే ఒకరికి ఎంత ఇష్టం, అభిమానమో చెప్పుకొచ్చారు. ఇద్దరు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికి.. జూనియర్ మాత్రం టాప్ హీరోగా ఎదగ్గా.. కళ్యాణ్ రామ్ ఒడిదుడుకులను ఎదుర్కొంటూ కెరీర్‌లో ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య అనుబంధాన్ని తెలిపే ఆసక్తికర సన్నివేశం ఒకటి చోటు చేసుకుంది. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో వైరలవుతోంది. కళ్యాణ్ రామ్ తాజాగా నటించిన చిత్రం బింబిసార ఆగస్టు 5న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో కళ్యాణ్ రామ్ తన ఎన్టీఆర్ ఆర్ట్స్ యూట్యూబ్ చానెల్‌లో అప్‌క్లోస్ విత్ ఎన్‌కేఆర్(Up Close With NKR) అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాడు. దీనిలో బింబిసార మూవీ ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించాడు నందమూరి కళ్యాణ్ రామ్. ఈ క్రమంలో సినిమాల్లోకి తన ఎంట్రీ.. బాల నటుడిగా నటించిన చిత్రాలు.. తన లైఫ్‌లో వచ్చిన ప్లాప్‌లు.. ఆ తర్వాత కరోనా సమయంలో ఇండస్ట్రీ ఎదుర్కొన్న పరిస్థితులు.. అఖండ, ట్రిపుల్ ఆర్ సినిమాలు సాధించిన సక్సెస్ గురించి మాట్లాడుతుంటాడు. సరిగా ట్రిపుల్ ఆర్ సినిమా గురించి మాట్లాడే సమయంలో కళ్యాణ్ రామ్‌కి జూనియర్ ఎన్టీఆర్ కాల్ చేస్తాడు. దాంతో తనకి నూరేళ్లు.. ఇప్పుడే తల్చుకున్నాను.. తనే కాల్ చేశాడు.. అంటూ కాల్ మాట్లాడ్డానికి పక్కకు వెళ్లాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. ఇది చూసిన నెటిజనులు.. అన్నదమ్ముల మధ్య ఎంత మంచి అనుబంధం ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: Kalyan Ram: ‘బింబిసార’ సిరీస్ లో నన్ను, తారక్ ని కలిపి చూడబోతున్నారు: కళ్యాణ్ రామ్ ఇది కూడా చదవండి: పులి స్థానంలో మనిషి! కానీ.., యన్టీఆర్ యాక్టింగ్ కి మాత్రం హేట్సాఫ్!