హైదరాబాద్ సరూర్‌నగర్ విక్టోరియా మెమోరియల్ స్కూల్‌లో ఆర్సీ15 సినిమా షూటింగ్ జరుగుతుండగా.. బీజేపీ నాయకులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. స్థానిక బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి, బీజేపీ నాయకులతో కలిసి ఆందోళన చేపట్టారు. స్కూళ్ళు నడుస్తున్న సమయంలో షూటింగ్‌కు పర్మిషన్ ఎలా ఇచ్చారని బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి ప్రశ్నించారు. స్కూల్‌లో షూటింగ్ జరపడం వల్ల పిల్లలు కాన్సన్‌ట్రేషన్ దెబ్బతింటుందని, షూటింగ్ చూస్తూ చదువుపై ధ్యాస పెట్టలేరని ఆమె అన్నారు. విద్యాశాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే సబితా […]
ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా ఎదిగిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ప్రస్తుతం లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే వైజాగ్ షెడ్యూల్‌లో చరణ్‌తో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించిన మూవీ యూనిట్.. తాజాగా హైదరాబాద్‌లో మరో షెడ్యూల్‌ని ప్రారంభించారు. అయితే సరూర్ నగర్‌లో విక్టోరియా మెమోరియల్ స్కూల్‌లో షూటింగ్ చేసేందుకు వెళ్ళిన చిత్ర బృందానికి […]