బాలకృష్ణ ఈ పేరు వింటే ఫ్యాన్స్ కి పూనకాలు వచ్చేస్తాయి. ఆరు పదుల వయసులోనూ ఏ మాత్రం జోష్ తగ్గనివ్వకుండా ఫ్యాన్స్ ని సంతోషపెడుతున్నారు. స్వచ్ఛమైన మనసు కలిగిన బాలయ్య ఎవరితో అయినా ఇట్టే కలిసిపోతారు. తన అన్న కొడుకు హీరోగా ఎంట్రీ ఇస్తున్నారంటే మనస్ఫూర్తిగా స్వాగతించిన మంచి మనిషి బాలయ్య. అలాంటి బాలయ్య ఓ అమ్మాయి పుట్టినరోజు సెలబ్రేట్ చేశారు. మరి ఈ అమ్మాయి ఎవరో తెలుసా?
బాలకృష్ణ, ఆయన సతీమణి వసుంధర దేవితో కలిసి పుట్టినరోజు ఫంక్షన్ లో ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా? బాలయ్య దంపతులు ప్రత్యేకించి మరీ ఆ అమ్మాయి పుట్టినరోజు వేడుక జరిపారంటే ఖచ్చితంగా ఏ బంధువుల అమ్మాయో అని అనుకుంటున్నారా? అయితే మీరు పొరబడినట్టే. ఎందుకంటే ఆ అమ్మాయి బాలకృష్ణ వీరాభిమాని. ఏంటి.. ఒక అభిమాని పుట్టినరోజు వేడుకను బాలకృష్ణ సెలబ్రేట్ చేశారా? అని ఆశ్చర్యపోతున్నారా? మరి బాలయ్య అంటే ఏమనుకున్నారు. సింప్లిసిటీకి కేరాఫ్ అడ్రస్. ఆయన వాడే బ్రాండ్ మ్యాన్షన్ హౌస్ అయితే.. ఫ్యాన్స్ కి ఆయనొక ఫ్యాన్షన్ హౌస్. ఫ్యాన్స్ కోసం సినిమాల్లో ఎంత కష్టమైనా పడతారు. రియల్ లైఫ్ లో కూడా ఫ్యాన్స్ కోసం ఏమైనా చేస్తారు.
హీరోలంటే స్టార్లు.. ఆకాశంలో ఆ నక్షత్రాలు ఎలాగో ఈ హీరోలు కూడా అలానే. ఫ్యాన్స్ అంత త్వరగా హీరోల దగ్గరకు వెళ్ళలేరు. వీరాభిమానులకు కూడా అభిమాన హీరోలను కలిసే అవకాశం చాలా అరుదుగా వస్తుంది. అలాంటిది అభిమాన హీరో అభిమాని పుట్టినరోజు వేడుక జరిపితే ఇంకేమైనా ఉందా? ప్రస్తుతం ఈ అమ్మాయి పరిస్థితి అదే. తన ఫేవరెట్ హీరో బాలకృష్ణ.. లేడీ ఫ్యాన్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ చేయించారు. అనంతరం బాలకృష్ణ, ఆయన సతీమణి అక్షింతలు వేసి ఆ అమ్మాయిని ఆశీర్వదించారు. ఈ అరుదైన దృశ్యం యూఎస్ లోని ఫిలడెల్ఫియాలో చోటు చేసుకుంది. బాలకృష్ణ దంపతులు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు.
అక్కడ తానా మహాసభలు 2023లో పాల్గొన్నారు. చాలా ఘనంగా తానా మహాసభల వేడుక జరిగింది. బాలకృష్ణ ఎంట్రీ ఈ వేడుకకు హైలైట్ గా నిలిచింది. రాజసం ఉట్టిపడేలా సాంప్రదాయ దుస్తుల్లో బాలయ్య దర్శనమిచ్చారు. ఈ క్రమంలోనే ఒక లేడీ అభిమాని తన పుట్టినరోజు అని చెప్పగానే బాలకృష్ణ వెంటనే తన అభిమాని బర్త్ డే సెలబ్రేట్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక స్టార్ హీరో ఇలా అభిమాని పుట్టినరోజు వేడుక జరపడం నిజంగా బాలయ్య గొప్పతనం అని చెప్పవచ్చు. ఆ అభిమానికి జీవితాంతం గుర్తుండిపోయే ఒక జ్ఞాపకాన్ని ఇచ్చారు. బాలయ్య చేసిన పనికి ఆయన అభిమానులు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. దటీజ్ బాలయ్య అంటూ ఆయనను పొగిడేస్తున్నారు.
A Lady Fan Celebrated her birthday with our Legend #Balayya and Vasundhara garu at Philadelphia US#jyosribollineni #anganwadiwing pic.twitter.com/GkViaiSdzu
— jyothi bollineni(B+ve Blood Group) (@JyothiBollineni) July 10, 2023