కన్నడ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన అకాల మరణంతో సినీ తారలు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఇక పునీత్ రాజ్ కుమార్ కి టాలీవుడ్ యంగ్ టైగర్ యన్టీఆర్ కి మంచి స్నేహబంధం ఉంది. పునీత్ రాజ్ కుమార్ నటించిన చక్రవ్యూహ అనే చిత్రానికి ‘గెలయా గెలయా’ అనే పాట పాడారు. ఈ పాట సందర్భంగా జరిగిన షూట్ లో పునీత్ రాజ్ కుమార్, యన్టీఆర్ కి మద్య ఎంత గొప్ప అనుబంధం ఉందో అన్న విషయం స్పష్టంగా అర్థం అవుతుంది.
తెలుగు ఇండస్ట్రీలో యన్టీఆర్ కి ఎలాంటి మాస్ ఫాలోయింగ్ ఉందో.. కన్నడ చిత్ర సీమలో పునీత్ రాజ్ కుమార్ కి కూడా అదే రేంజ్ లో మాస్ ఫాలోయింగ్ ఉంది. తెలుగు లో యన్టీఆర్ డ్యాన్స్, కామెడీ, సెంటిమెంట్ సీన్లు ఎలా పండిస్తారో.. కన్నడ మూవీస్ లో కూడా అలాంటి ప్రతిభను కనబరుస్తారు పునీత్ రాజ్ కుమార్. అందుకే వీరి భావాలు, ఆలోచనలు.. నటన ఒకే రీతిలో ఉంటాయని ఫిలిమ్ వర్గాల్లో టాక్. అంతే కాదు ఒకే అభిప్రాయలు కలిగిన ఈ ఇద్దరు టాప్ హీరోలు మంచి స్నేహితులు కావడం మరో విశేషం. అందుకే పునీత్ పై ప్రేమతో చక్రవ్యూహ అనే చిత్రానికి ‘గెలయా గెలయా’ పాట పాడారు యన్టీఆర్.
Heartbroken!
Can’t believe you have gone so soon. pic.twitter.com/55lt4r62d1
— Jr NTR (@tarak9999) October 29, 2021