ఒకప్పుడు హీరోల గురించి విమర్శించాలన్నా, ట్రోల్ చేయాలన్నా సరే అది ఇద్దరూ లేదా ముగ్గురు వ్యక్తుల మధ్య మాటల వరకు మాత్రమే ఉండేది. ప్రస్తుతం టెక్నాలజీ కల్చర్ బాగా పెరిగిపోయింది కాబట్టి.. తమకు సినిమా గురించి ఏదనిపిస్తే అది సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఒకవేళ మూవీ టీమ్ కు ఈ విషయం తెలిస్తే బాధపడతారు లాంటి విషయాల్ని అస్సలు పట్టించుకోవడం లేదు. ఇప్పుడు అలాంటిదే జరిగింది. ‘వారసుడు’ సినిమాను కొందరు ట్రోలర్స్.. సీరియల్ లో పోల్చారు. దీంతో దర్శకుడు వంశీ తన ఆగ్రహాన్ని బయటపెట్టాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. థియేటర్ లేదా ఓటీటీలో రిలీజైన ప్రతి సినిమా కూడా ప్రేక్షకులకు నచ్చాలని లేదు. బాగుంటే నలుగురికి చెబుతారు లేదంటే వాళ్లే కొన్నిసార్లు ట్రోల్ చేస్తుంటారు. ఈ మధ్య కాలంలో అలా విమర్శలకు గురవుతున్నా చిత్రం వారసుడు. పలువురు నెటిజన్స్ అయితే బహిరంగంగానే.. ఆ సినిమాలా ఉంది, ఈ సినిమాలా ఉందని అంటున్నారు. ఇప్పుడు మరికొందరు డైలీ సీరియల్స్ తో పోల్చరు. ఇక దీనిపై ఫైర్ అయిన డైరెక్టర్ వంశీ.. సినిమా తీయడం చాలా కష్టమని, మరీ ఇంత నెగిటివ్ గా ఉండొద్దంటూ ఫుల్ ఫైర్ అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియోనే వైరల్ గా మారింది.
‘ఈ రోజుల్లో సినిమా తీయడం చాలా కష్టమైన పని. ఇదంతా టీమ్ వర్క్. ఆడియెన్స్ ని ఎంటర్ టైన్ చేయడానికి మేం పడే కష్టం ఎలా ఉంటుందో తెలుసా? ప్రతి మూవీ వెనక ఎన్నో త్యాగాలు ఉంటాయి. మన దేశంలోని సూపర్ స్టార్స్ లో విజయ్ కూడొ ఒకరు. ప్రతి సీన్ కు రిహార్సల్స్ చేయాల్సి ఉంటుంది. మనం ఏం చేయగలమనేది మన చేతుల్లోనే ఉంటుంది. ఫలితం కాదు. ఆయనే నా సినిమాకు సమీక్షకుడు, విమర్శకుడు. ఆయన కోసమే సినిమా చేశాను. మరీ ఇంత నెగిటివ్ గా ఉండకండి. సాఫ్ట్ వేర్ జాబ్ వదిలేసి ఇండస్ట్రీకి వచ్చాను. ఈ రోజు నేనేంటో నాకు తెలుసు. ప్రేక్షకుల్ని అలరించడానికే సినిమా చేశాను.’ అని వంశీ పైడిపల్లి.. ట్రోలర్స్ కు గట్టి కౌంటర్ ఇచ్చారు. మరి వంశీ ఫైర్ కావడంపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని చెప్పండి.
“படம் எடுக்குறது ஒண்ணும் ஜோக் கிடையாது!” – விமர்சனங்களுக்கு இயக்குநர் வம்சியின் பதில்!
Full Interview- https://t.co/hpZdmJkxdB#VamshiPaidipally | #Varisu | #Vijay pic.twitter.com/PRRXSMbn2H
— சினிமா விகடன் (@CinemaVikatan) January 17, 2023