సూర్య హీరోగా దర్శకుడు జ్ఞానవేల్ తెరకెక్కించిన మూవీ జైభీమ్. ఇటీవల అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ సినిమా ఎనలేని ప్రసంశలు పొందుతోంది. బాధ్యత గల లాయర్ గా సూర్య నటన అద్భుతమని పలువురు ప్రముఖులు కీర్తిస్తున్నారు. అయితే ఇటీవల తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సైతం ఈ మూవీని చూసి సినిమాపై ప్రసంశలు కురిపించారు. ఇలా ప్రతీ ఒక్కరు ఈ సినిమాను చూసి చాలా ఎమోషనల్ అవుతున్నారు.
ఇక తాజాగా ‘రాధేశ్యామ్’ మూవీ డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ కూడా జైభీమ్ మూవీపై అభినందనలు తెలియజేశారు. తాజాగా ట్విట్టర్ లో స్పందించిన ఆయన ఈ విధంగా కామెంట్ చేశారు. ఇలాంటి సినిమాలు కొన్ని చాలా అరుదుగా వస్తాయి. అలా వచ్చిన కొన్ని చిత్రాలు మాత్రమే మనల్ని ఎమోషనల్ గా ఎడ్యుకేట్ చేస్తాయి. అయితే గతంలో నగ్నసత్యాలు అనే కొన్ని అకృత్యాల్ని ‘జైభీమ్’ చిత్రం మన కళ్ళకు కడుతుంది.
ఈ మూవీ నన్ను ఎంతగానో బాధించించటమే కాకుండా అసలు మాటలు రాకుండా చేసింది. ఇలాంటి అత్యద్భుతమైన చిత్రాన్ని మనందరికీ అందించిన హీరో సూర్యకి, దర్శకుడు జ్ఞానవేల్ కి గౌరవాభినందనలు ’ అంటూ డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ స్పందించారు. ఓ గిరిజన యువకుడు చేయని నేరానికి పోలీసులు అరెస్ట్ చేసి అతి దారుణంగా కొట్టి చంపటంపై లాయర్ గా సూర్య చేసిన సేవలు చాలా అద్భుతంగా చూపించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా మంచి టాక్ తో దూసుకుపోతోంది.
Very few films can emotionally educate us. #JaiBheem is a brutal truth narrating the atrocities of the past, disturbing pain and suffering of the voiceless!! Respects to @Suriya_offl sir and director #TJGnanavel sir for bringing such a story to everyone.
— Radha Krishna Kumar (@director_radhaa) November 4, 2021