మెగా ఫ్యామిలీలో అల్లు అర్జున్ రూటే సపరేట్. సినిమా కథలను ఎంచుకునే విధానం ఆయన దారి వేరనే చెప్పాలి. అయితే గంగోత్రి సినిమాతో టాలీవుడ్‌లోకి ఏంట్రీ ఇచ్చిన ఆయన సూపర్ హిట్ సినిమాలతో టాలీవుడ్ అగ్ర హీరోల జాబితాలోకి వెళ్లిపోయారు. అటు డ్యాన్స్‌లోనూ ఇటు నటనలోనూ తన సత్తాను చాటుతున్నాడు ఈ ఐకానిక్ స్టార్. ఇక డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ఓ సినిమా రానుందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతూనే ఉంది.
అయితే తాజాగా దీనిపై మారుతి తన మనసులోని మాటలను బయట పెట్టాడు. అల్లు అర్జున్‌తో ఎలాగైన ఓ యానిమేషన్ సినిమా చేయాలని భావిస్తున్నట్లు తెలిపాడు. ఎప్పటి నుంచో ఆ కల అలాగే ఉందని ఆయన అన్నారు. అల్లు అర్జున్ కూడా దీనికి సై అన్నట్లు తెలుస్తోంది. వరుస సినిమాలతో బిజీగా మారిన ఆయన మారుతి యానిమేషన్ మూవీకి ప్లాన్‌కు ఓకే చెప్పినట్లు సమాచారం. అల్లు అర్జున్ ప్రస్తుతం టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్వకత్వంలో పుష్ప అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.
పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇందులో అల్లు అర్జున్ సరసన హీరోయిన్ రష్మిక నటిస్తోంది. ఇక మారుతి కూడా వరుస సినిమాలతో బిజీగా మారాడు. ప్రస్తుతం మంచిరోజులొచ్చాయి, పక్కా కమర్షియల్ వంటి చిత్రాలను ఆయన తెరకెక్కిస్తున్నాడు. మరి వీళ్లిద్దరు అనుకున్నట్లుగా పక్కా యానిమేషన్ సినిమా ఎప్పుడు మొదలవుతుందో చూడాలి మరి.