సాయి ధరమ్ తేజ్ నటించిన ‘రిపబ్లిక్’ మూవీ అక్టోబర్ 1న రిలీజ్ అయ్యి మంచి హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రేక్షకులు, అభిమానులు కూడా సినిమాకు మంచి రేటింగ్ ఇస్తున్నారు. సినిమా మొత్తంలో అందరూ క్లైమాక్స్ గురించే ప్రస్తావిస్తున్నారు. అవకాశాలు లేని సమయంలో దర్శకుడు దేవకట్టను నమ్మి సాయిధరమ్ తేజ్ ఒక అవకాశం ఇచ్చాడు. సాయిధరమ్ తేజ్ ఇచ్చిన అవకాశాన్ని, పెట్టుకున్న నమ్మకాన్ని దర్శకుడు దేవకట్ట నిలబెట్టుకున్నాడని అభిమానులు ప్రశంసిస్తున్నారు. సాయిధరమ్ తేజ్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు.. కానీ, ప్రీరిలీజ్ ఈవెంట్, సినిమా రిలీజ్ ఎందుకు చేశారని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రశ్నలకు నేరుగా సినిమా దర్శకుడు దేవకట్టనే సమాధానం చెప్పారు.
సినిమా చూసిన తర్వాత దర్శకుడు దేవకట్ట మాట్లాడాడు. ‘సినిమాను అక్టోబర్ మొదటివారంలోనే విడుదల చేయాలని సాయి ధరమ్ తేజ్ కోరుకున్నాడు. సినిమా కథ విన్న దగ్గరనుంచి సాయిధరమ్ తేజ్ ఈ సినిమా చేయాల్సిందే అన్నాడు. సినిమా క్లైమాక్స్ విన్నాక.. క్లైమాక్స్ మార్చితే సినిమా చేయనని చెప్పాడు’ అంటూ దేవకట్ట చెప్పాడు. సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం గురించి మీడియా ప్రశ్నించగా.. ‘సాయి ధరమ్ తేజ్ చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. గత మూడ్రోజులుగా ఫోన్లో మాట్లాడుతున్నాడు. హిట్ టాక్ రావడంతో సాయి ధరమ్ తేజ్ ఎంతో భావోద్వేగానికి లోనయ్యాడు. సినిమాకు సంబంధించి సాయి తేజ్ అన్ని విషయాలను ఫాలో చేస్తున్నాడు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నది కూడా నా తమ్ముడు సాయిధరమ్ తేజ్ చూస్తున్నాడు’ అంటూ దేవకట్ట భావోద్వేగంగా మాట్లాడాడు.
తర్వాతి ప్రాజెక్టు ఎవరితో అని అడిగిన ప్రశ్నకు ఇంకా ఎవరితో అనుకోలేదని.. వెయింటింగ్ అని సమాధానం చెప్పాడు. సినిమాలో రమ్యకృష్ణ, జగపతిబాబు నటనకు అభిమానులు ఫిదా అయిపోయారు. సాయిధరమ్ తేజ్ యాక్టింగ్ నెక్స్ట్ లెవల్ అంటూ ప్రశంసిస్తున్నారు. సినిమా హిట్ టాక్ రావడం.. సాయిధరమ్ తేజ్ ఆరోగ్యంపై క్లారిటీ రావడంతో అభిమానులు ఫుల్ ఖుష్‌గా ఉన్నారు. ‘రిపబ్లిక్’ మూవీ ఎలా ఉందో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి.