ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ద్వారా చాలామంది సెలబ్రిటీలు అయిపోతున్నారు. యూట్యూబ్ వేదికగా షార్ట్ ఫిలిమ్స్ లో నటించి సినిమా అవకాశాలు అందుకుంటున్నారు. సోషల్ మీడియాలో క్రేజ్ వచ్చాక ఏకంగా టీవీ ప్రోగ్రామ్స్ లో.. బిగ్ బాస్ రియాలిటీ షోలో ప్రత్యక్షమవుతున్నారు. ఆ విధంగా యూట్యూబ్ నుండి వచ్చి బిగ్ బాస్ బ్యూటీగా సూపర్ క్రేజ్ దక్కించుకున్న సోషల్ మీడియా స్టార్స్ లో దేత్తడి హారిక ఒకరు.
సోషల్ మీడియా పాపులారిటీ తర్వాత బిగ్ బాస్ ద్వారా హారిక సెలబ్రిటీ హోదా పొందింది. దేత్తడి అనే యూట్యూబ్ ఛానల్ పేరునే తన ఇంటిపేరుగా తగిలించుకొని ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. అయితే.. బిగ్ బాస్ బ్యూటీలకు సోషల్ మీడియా ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. వారు హౌస్ లో అడుగు పెట్టకముందు నుండి బయటికి వచ్చేదాకా ఫాలోయింగ్ విపరీతంగా పెరుగుతుంది.
ఇక సోషల్ మీడియా స్టార్ అయిన హారిక చేసే రచ్చ మామూలుగా ఉండదు. కెరీర్ పరంగా సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తున్న హారిక.. అందాల ఆరబోతలో ఎల్లప్పుడూ ముందే ఉంటుంది. ఎప్పటికప్పుడు నెట్టింట తన ఫోటోలను, వీడియోలను అభిమానులతో షేర్ చేసుకుంటుంది. ఇదిలా ఉండగా.. తాజాగా ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో కొత్తగా గ్లామరస్ ఫోటోలు పోస్ట్ చేసింది. టైట్ జీన్స్ లో హారిక అందాలు వైరల్ అవుతున్నాయి. మరి దేత్తడి హారిక లేటెస్ట్ ఫోటోలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.