తెలుగులో చేసినవి రెండు, మూడు సినిమాలే అయినా.. మంచి గుర్తింపు తెచ్చుకుంది ఆ నటి . ఒకటి టాలీవుడ్ టాప్ హీరోతో రొమాన్స్ చేయగా.. యంగ్ టాలెంట్‌లో ఒకరితో నటించి మెప్పించింది. ఆమె నటించిన సినిమాలోని పాటలు కూడా వింటుంటే ఇప్పటికి చాలా
హైట్‌కు తగ్గట్టు ఫిజిక్, కాస్త అందంగా ఉంటే చాలు టాలీవుడ్ అటువంటి హీరోయిన్లకు రెడ్ కార్పెట్ పరుస్తుంది. అటువంటి జాబితాలో ఆ హీరోయిన్ కూడా ఒకరు. తెలుగులో చేసినవి రెండు, మూడు సినిమాలే అయినా.. మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఒకటి టాలీవుడ్ టాప్ హీరోతో రొమాన్స్ చేయగా.. యంగ్ టాలెంట్‌లో ఒకరితో నటించి మెప్పించింది. ఆమె నటించిన సినిమాలోని పాటలు కూడా వింటుంటే ఇప్పటికి చాలా శ్రావ్యంగా ఉంటాయి. హిందీ పరిశ్రమ నుండి వచ్చి మెప్పించిన ఆ నటి మరెవ్వరో కాదూ ఆశిమా భల్లా. ఆమె పేరు చెబితే గుర్తుకు రాకపోవచ్చు కానీ.. డాడీ సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటించింది ఆమె.
‘పట్టా పక్కింటి నాటు కోడి పెట్టనీ, పెడతా ఎంచక్కా ప్రేమ బువ్వనీ’అంటూ డాడీ సినిమాలో చిరంజీవి, సిమ్రాన్లకు పోటా పోటీగా నాట్యం చేసిన హీరోయిన్ గుర్తుందా..? అంతే కాదూ. ‘నన్ను లాలించు సంగీతం నువ్వే కదా’అంటూ సాగిపోయే పాటలో ఎంతో సైలెంట్ గా కనిపిస్తుంది. ఆమె కోసం పరితపించుపోయే పాత్రలో కనిపిస్తారు తొట్టెంపూడి వేణు. ఆమెనే ఆశిమా భల్లా. ఈ రెండు సినిమాలతో ఆమె చాలా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత తెలుగులో నాయుడు ఎల్‌ఎల్‌బిలో చివరిసారిగా కనిపించి తెరమగురైంది. హిందీ, తమిళంలో కూడా అడపాదడపా సినిమాలు చేసింది. అలాగే బుల్లితెరలో కూడా కనిపించింది. ఆ తర్వాత చిత్ర పరిశ్రమకు గుడ్ బై చెప్పిసింది ఈ అమ్మడు.
సన్నీ మీనన్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తుంది. పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్‌కు స్టిక్ ఆన్ అయిపోయింది. వీరికి ఓ పాప. ఆమె గతంలో మహేంద్ర కారు యాడ్‌లో ఓ సారి కనిపించింది. అయితే అప్పటితో పోలిస్తే.. ఆమె ఇప్పుడు మరింత అందంగా,నాజుగ్గా కనిపిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఇప్పటి హీరోయిన్స్ కు ఏ మాత్రం తీసిపోనట్లుగా లుక్స్ తో మెస్మరైజ్ చేస్తోంది. ఆమెకు పెళ్లై 10 ఏళ్లు దాటయంటే ఎవ్వరూ నమ్మరు. ప్రస్తుతం ఫ్యామిలీతో టూర్స్ వెళుతూ.. ఆ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటుంది. ఆ ఫోటోలను చూసిన వారంతా ఆమె గత సినిమాల గురించి ప్రస్తావిస్తూ.. పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.