రాహుల్ రామకృష్ణ.. తెలుగు ప్రేక్షకులకు ఈ కమెడియన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అర్జున్ రెడ్డి, జాతి రత్నాలు, ట్రిపులార్ వంటి సినిమాలతో తానేంటో నిరూపించుకున్నాడు. ఇంకా ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. రాహుల్ రామకృష్ణ ట్విట్టర్లో బాగా యాక్టివ్ గా ఉంటాడు. ఇటీవల ట్రోలింగ్ గురించి ఓ అభ్యంతకర ట్వీట్ చేసిన సంగతి కూడా తెలిసిందే.
తాజాగా రాహుల్ రామకృష్ణ తన ట్విట్టర్ లో బోరింగ్ గా ఉంది. సినిమాలు, మ్యూజిక్, లిటరేచర్, మ్యూజిక్ గురించి ఏవైనా ప్రశ్నలు అడగచ్చు అంటూ తన ఫాలోవర్స్ కు అవకాశం ఇచ్చాడు. ఇటీవలి కాలంలో ఫ్యాన్స్ తో ఎంగేజ్ అయ్యేందుకు సెలబ్రిటీలు ఈ ఫార్ములాను బాగా వాడుతున్నారు. వారి నుంచి వచ్చే ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇస్తుంటారు.
Bored. Ask me anything about films, literature and music. Will answer the interesting ones 🫠
— Rahul Ramakrishna (@eyrahul) August 5, 2022
అయితే ఆ ఆస్క్ మీ సంథింగ్ లో రాహుల్ రామకృష్ణను ఓ ఫాలోవర్ కాస్త ఇరకాటంలో పెట్టే ప్రశ్న అడిగాడు. అదేంటంటే.. “తాగేసి ట్వీట్లు వేసిన సందర్భాలు ఉన్నాయా.. గురూ” అంటూ ప్రశ్నించాడు. అందుకు రాహుల్ రామకృష్ణ ఏమాత్రం దాపరికం లేకుండా “చాలాసార్లు” రిప్లై ఇచ్చాడు. అయితే రాహుల్ రామకృష్ణ లేదనో, కాదనో చెప్పచ్చు. కానీ, ఉన్నది ఉన్నట్లు ఒప్పుకుని తన ఫ్యాన్స్ దగ్గర మంచి మార్కులు కొట్టేశాడు. రాహుల్ రామకృష్ణ సమాధానంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Taagesi tweets esinaa sandarbhaalu unnayaaa,Guru ??
— Tom (@Nenu_jerry) August 5, 2022
ఈ మధ్య నీ లెక్క తెలంగాణా మాండలికం లో చాలా తక్కువ మంది మాట్లాడుతరు, sounds authentic and original..దానికి ఏమన్నా homework చేస్తవ భయ్ లేదా naturalగా అంతేనా?
— కిష్కింధ (@KKishkinda) August 5, 2022
A book you read recently and would recommend?
— sangeetha devi (@Sangeetha_Devi) August 5, 2022