కమెడియన్ బ్రహ్మానందం.. తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేని పేరు. ఆయన స్క్రీన్ పై కనిపిస్తే చాలు మనస్ఫూర్తిగా నవ్వుకోవడం. మనకు బాగా బాధగా అనిపించినప్పుడు యూట్యూబ్ లో ఆయన కామెడీ వీడియోస్ చూసి రిలాక్స్ కావడం. ఇక ఆయన ఎక్స్ ప్రెషన్స్ కి చాలామంది ఫ్యాన్స్. వాటిని చూసిన ప్రతిసారీ మీలో చాలామంది కిందపడి దొర్లిదొర్లి నవ్వుతారు! అలాంటి బ్రహ్మీ.. ఇప్పుడు జస్ట్ ఒకే ఒక్క వీడియో.. మొత్తం సోషల్ మీడియానే షేక్ చేస్తున్నారు. దీనిని నటుడు బ్రహ్మాజీ షేర్ చేశాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. బ్రహ్మానందం అనగానే ఇప్పటి జనరేషన్ లో చాలామందికి వెంకీలో గజాల ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ, దుబాయ్ శీనులో రామకృష్ణ అనే గుర్తొస్తారు. ఇక సోషల్ మీడియాలో మీమ్స్ రూపంలో బ్రహ్మానందం మన రోజువారీ జీవితంలో భాగమైపోయారు. 1000కి పైగా సినిమాల్లో ఎన్నో అద్భుతమైన రోల్స్ చేసిన బ్రహ్మానందం.. ఈ మధ్య సినిమాల్లో నటించడం బాగా తగ్గించేశారు. ఈ ఏడాది భీమ్లా నాయక్, ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రాల్లో అలా జస్ట్ కొన్ని నిమిషాలే కనిపించి పాతరోజుల్ని గుర్తుచేశారు.
ఇదంతా పక్కనబెడితే.. బ్రహ్మానందంకి సంబంధించిన ఓ వీడియో యూట్యూబ్, ఇన్ స్టాలో తెగ వైరల్ అవుతోంది. ఇందులో బ్రహ్మీ ఓ షార్ట్, షర్ట్ తో అలా నడుచుకుని వస్తుంటారు. ఇక ఈ వీడియోకి ‘విక్రమ్’లోని రోలెక్స్ బీజీఎం యాడ్ చేయడంతో ఆ వీడియో ఎట్రాక్టివ్ గా మారిపోయింది. వీడియోలో మ్యూజిక్ కి తగ్గట్లు బ్రహ్మీ స్వాగ్ ఉండటం, వీడియో మరింతగా ఎంటర్ టైన్ చేస్తోంది. మరి ఈ వీడియోలో బ్రహ్మీ స్టైల్ మీకెలా అనిపించిందో, మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి: అసలు ‘RRR’కి ఆస్కార్ ఎందుకు ఇవ్వాలి? ఫ్యాన్స్ తెలుసుకోవాల్సిన నిజాలు!