మెగాస్టార్ చిరంజీవి.. ఈ సంక్రాంతికి రచ్చ చేయడం గ్యారంటీ! ఎందుకంటే ఎక్కడా చూసినా ‘వాల్తేరు వీరయ్య’ హంగామానే కనిపిస్తుంది. ఫుల్ మాస్ ఎంటర్ టైనర్ గా తీసిన ఈ మూవీపై రోజురోజుకు ఎక్స్ పెక్టేషన్స్ పెరుగుతూనే ఉన్నాయి తప్పించి అస్సలు తగ్గడం లేదు. వీటన్నింటికి ఇంకాస్త ఎనర్జీ యాడ్ చేసినట్లు.. ఇప్పుడు సెన్సార్ టాక్ కూడా ఈ మూవీపై మరింత అంచనాల్ని పెంచుతూ పోయింది. ప్రస్తుతం ఈ విషయమే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలోనే వసూళ్లు కూడా గట్టిగానే రాబోతున్నట్లు సిగ్నల్స్ వచ్చేస్తున్నాయి.
ఇక వివరాల్లోకి వెళ్తే.. మెగాస్టార్ చిరంజీవి గతేడాది ‘ఆచార్య’, ‘గాడ్ ఫాదర్’ సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించారు కానీ అనుకున్న రేంజ్ లో ఎంటర్ టైన్ చేయలేకపోయారు. ఇప్పుడు మాత్రం పునకాలు తెప్పించేందుకు రెడీ అయిపోతున్నారు. అందులో భాగంగానే ఈ సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’గా రాబోతున్నారు. జనవరి 13న ఈ సినిమా వరల్డ్ వైడ్ థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే తాజాగా సెన్సార్ పూర్తయింది. ఈ సినిమా చూసిన సెన్సార్ సభ్యులు.. U/A సర్టిఫికెట్ ఇచ్చారు. ఆ పోస్టర్ ని కూడా మూవీ టీమ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
సెన్సార్ టీమ్ చెప్పిన దాని ప్రకారం.. రీఎంట్రీలో చిరుని ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో ఈ మూవీ అలానే ఉండనుందట. రికార్డులు బ్రేక్ అయ్యే రేంజ్ లో సినిమాను డిజైన్ చేశారట. చిరంజీవి-రవితేజ కాంబోలోని సీన్స్ అయితే.. ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించడం గ్యారంటీ అని వాళ్లు చెప్పారు. ఎమోషనల్, యాక్షన్ సీన్స్ అయితే హైలెట్ గా ఉంటాయని సమాచారం. ఈ సినిమాలో చిరు స్టెప్పులకు.. సెన్సార్ సభ్యులు ఫిదా అయిపోయారట. ఇలా మొత్తంగా ‘వాల్తేరు వీరయ్య’.. అభిమానులకు ఫీస్ట్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. సరే ఇదంతా పక్కనబెడితే చిరు ‘వాల్తేరు వీరయ్య’ ఎలా ఉండబోతుందని మీరనుకుంటున్నారు. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
Its a U/A for #WaltairVeerayya 💥🤘🏾
Sankranthi ki ROUGH AADINCHESTADU 🔥❤️🔥#POONAKAALULOADING 🔥💣#WaltairVeerayyaOnJan13th
Mega ⭐ @KChiruTweets @RaviTeja_offl @dirbobby @shrutihaasan @CatherineTresa1 @ThisIsDSP @konavenkat99 @SonyMusicSouth pic.twitter.com/qeLc5q2hMr— Mythri Movie Makers (@MythriOfficial) January 2, 2023