తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఎవరికి ఏ ఆపద వచ్చినా నేనున్నాంటూ ముందుకు వస్తారు. మెగాస్టార్ ని స్ఫూర్తిగా తీసుకొని ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న ఓ మెగా అభిమాని క్యాన్సర్ బారిన పడ్డాడు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి వెంటనే స్పందించారు. హైదరాబాద్‌కు పిలిపించి.. మెరుగైన వైద్యం అందించి ప్రాణాలు నిలబెట్టారు. వివరాల్లోకి వెళితే..
కృష్ణాజిల్లా కు చెందిన దొండపాటి చక్రధర్ కి మెగాస్టార్ చిరంజీవి అంటే ఎంతో అభిమానం. చిరు స్ఫూర్తిగా ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ వచ్చాడు చక్రధర్. ఎవరు ఆపదలో ఉన్నా.. నేనున్నాంటూ వెంటనే స్పందించేవాడు. మెగా అభిమానుల తరపున ఆదుకుని అండగా నిలిచేవాడు. గత కొంత కాలంగా చక్రధర్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు.
ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ వెంటనే చక్రధర్ ని హైదరాబాద్ లోని ఒమేగా హాస్పిటల్ లో జాయిన్ చేయించారు. చక్రధర్ కి మెరుగైన వైద్యసేవలు అందించాలని డాక్టర్లకు సూచించారు చిరంజీవి. అంతేకాదు చక్రధర్ కుటుంబానికి అండగా ఉంటామని చిరంజీవి భరోసా ఇచ్చారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
చక్రీధర్ ని స్వయంగా హస్పటల్ కి వేళ్ళి కలిసిన చిరంజీవీగారు @KChiruTweets 🙏🏻🔥❤️ pic.twitter.com/F18vtR6AL2
— SivaCherry (@sivacherry9) August 15, 2022