తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు రెబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న కృష్ణం రాజు ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు. నటనతో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న క్రిష్ణం రాజు నట వారసుడిగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండయా స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. నేడు క్రిష్ణం రాజు పుట్టిన రోజు సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
‘సోదర సమానుడు, తెలుగు చిత్ర పరిశ్రమకు తొలి రెబెల్ స్టార్, నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా, కేంద్ర మంత్రిగా అడుగిడిన ప్రతి రంగంలో తనదైన ప్రత్యేక ముద్ర వేసిన శ్రీ కృష్ణంరాజు గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఆహ్లాదంగా ఉండాలని కోరుకుంటున్నాను’ హ్యాపీ బర్త్ డే కృష్ణంరాజు అంటూ ట్విట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి.
Happy Birthday #KrishnamRaju garu !💐 pic.twitter.com/VgyQvjIyN4
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 20, 2022