పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఆ పేరే ఓ బ్రాండ్.. దానిలో వైబ్రేషన్ ఉంది. పవర్ స్టార్ అనే మాట వినిపిస్తే చాలు అభిమానులకు పూనకాలు. ఫ్యాన్స్ ఆయన్ని దేవుడిగా ఆరాధిస్తారంటే అతిశయోక్తి కాదు. అయితే పవన్‌పై ప్రేక్షకులు ఇంతలా ప్రేమను, అభిమానాన్ని పెంచుకోవడానికి కారణం సినిమాలు మాత్రమే కాదు.. వ్యక్తిగతంగా ఆయన క్యారెక్టర్ నచ్చి ఎందరో పవన్ కళ్యాణ్ అభిమానులుగా మారారు. ఇక ఆయన చేసే సేవా కార్యక్రమాల గురించి ఎంత చెప్పినా తక్కువే.
మెగా హీరో చిరంజీవి సోదరుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. తనదైన స్టైల్, యాటిట్యూడ్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయనకంటూ అభిమానులను సంపాదించుకున్నారు. ఇక సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు. ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అభిమానులు, సినీ, రాజకీయ సెలబ్రిటీలు.
ఈ క్రమంలో తమ్ముడు పుట్టిన రోజు సందర్భంగా చిరంజీవి చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. కళ్యాణ్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు అంటూ తమ్ముడిపై తనకున్న వాత్సల్యాన్ని చాటుకున్నారు చిరంజీవి. ‘‘తన ఆశ,ఆశయం ఎల్లప్పుడూ జనహితమే. తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఎప్పుడూ నిజాయితీతో, చిత్తశుద్ధితో శ్రమించే పవన్ కళ్యాణ్ ఆశయాలన్నీ నెరవేరాలని కోరుకుంటూ, ఆశీర్వదిస్తూ, కళ్యాణ్ బాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను’’ అంటూ చిరంజీవి చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
తన ఆశ,ఆశయం ఎల్లప్పుడూ జనహితమే. తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఎప్పుడూ నిజాయితీతో, చిత్తశుద్ధితో శ్రమించే
పవన్ కళ్యాణ్ ఆశయాలన్నీ నెరవేరాలని కోరుకుంటూ, ఆశీర్వదిస్తూ, కళ్యాణ్ బాబుకి పుట్టినరోజు 💐శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.❤️
Happy Birthday @PawanKalyan ! pic.twitter.com/NiQsUPdF4J— Chiranjeevi Konidela (@KChiruTweets) September 2, 2022