Chinmayi: ప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద అంటే గుర్తుపట్టలేకపోవచ్చు కానీ, ఆమె మాట్లాడితే మటుకు ఇట్టే గుర్తుపట్టేస్తారు. అరే సమంత మాట్లాడినట్లే మాట్లాడుతున్నారే అంటారు. సమంతకు గత పదేళ్లకుపైగా డబ్బింగ్ చెబుతున్నారామె. ఇక, తమిళ స్టార్ రైటర్‌పై చిన్మయి లైంగిక వేధింపుల ఆరోపణలు చేసి సంచలనం సృష్టించారు. అప్పటినుంచి మహిళలకు సంబంధించిన అన్ని విషయాలపై గట్టిగానే స్పందిస్తూ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వస్తూ ఉన్నారు.
పురుషుల ఆగ్రహాన్ని ఎదుర్కొంటూ ఉన్నారు. గతంలో ప్రముఖ హీరోయిన్ మీరా చోప్రా జూ.ఎన్టీఆర్ తనకు తెలియదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల కారణంగా మీరా చోప్రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యారు. ఈ నేపథ్యంలోనే మీరా చోప్రాకు చిన్మయి మద్దతుగా నిలిచారు. చిన్మయి కూడా ట్రోలింగ్‌కు గురయ్యారు. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో దీనిపై చిన్మయి స్పందించారు. ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘‘ స్టార్‌ల మీద ఫ్యాన్స్‌కు ఉండే లవ్‌ను అర్థం చేసుకోగలను.
అందుకని ఇతరులను తిట్టడం కరెక్ట్ కాదు. ఎవరికి ఎవరు తెలియకపోతే ఏంటి?. యుఆర్ గోయింగ్, యుఆర్ వాచింగ్.. అందులో తప్పేం లేదు. వాళ్లు నిజాయితీగా తమ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు. తెలియకుంటే తర్వాత తెలుసుకుంటారు’’ అని అన్నారు. మరి, చిన్మయి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : ‘బ్రహ్మాస్త్ర’ మూవీపై డైరెక్టర్ రాజమౌళి ప్రశంసలు! ఏమన్నాడంటే?