లైగర్.. ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఈ సినిమా గురించే టాక్. విజయ్ దేవరకొండ- పూరీ కాంబోలో రాబోతున్న ఈ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నార్త్ మొత్తం ప్రమోషన్స్ చేసిన ఈ సినిమా బృందం.. ఇప్పుడు తెలుగులోనూ ప్రమోషన్స్ షురూ చేశారు. అందులో భాగంగా చార్మీ హోస్ట్‌గా ఓ ఇంటర్వ్యూ ప్లాన్ చేశారు.
ఫ్యాన్స్ అడుగుతున్న ప్రశ్నలను సేకరించి హీరో, డైరెక్టర్‌ను చార్మీ అడిగింది. ప్రేక్షకులు, ఫ్యాన్స్ లో మదిలో మెదులుతున్న ఎన్నో ప్రశ్నలకు ఈ ఇంటర్వ్యూ ద్వారా సమాధానాలు ఇవ్వాలని ప్లాన్ చేశారు. అంతేకాకుండా సినిమాపై ఎలాంటి అనుమానం లేకుండా ప్రేక్షకులు థియేటర్‌కు వెళ్లేలా చేసేందుకు ఓ ప్రయత్నం చేశారు. ఈ ఇంటర్వ్యూలో చార్మీ ఎన్నో ఆసక్తికరమైన ప్రశ్నలను విజయ్- పూరీ జగన్నాథ్ అడగడం జరిగింది.
ఈ ఇంటర్వ్యూలో చార్మీ ఓ ప్రశ్న అడుగుతూ ఏడ్చేసింది. “బడ్జెట్ అనుకున్న దానికన్నా పెరిగిపోయింది. చేతిలో ఒక్క రూపాయి లేని సమయంలో ఓటీటీ నుంచి ఎంతో గొప్ప ఆఫర్ వచ్చింది. ఆ సమయంలో ఆఫర్ వదులుకోవాలంటే ధైర్యం కావాలి” అంటూ చార్మీ ఏడ్చేసింది. ఇంకా ఇలాంటి ఎన్నో ఆసక్తికర ప్రశ్నలకు లైగర్ సినిమా హీరో, డైరెక్టర్ సమాధానాలు చెప్పారు. ఫుల్ ఇంటర్వ్యూ ఆగస్టు 19న రిలీజ్ చేయనున్నారు. లైగర్ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.