పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన బద్రి చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ అమీషా పటేల్. తన అందం, అభినయంతో అప్పట్లో ఈ అమ్మడు కుర్రకారును ఓ ఊపు ఊపింది. అయితే ఈ అమ్మడు మూడు పదుల వయసు దాటినా కూడా తన చెక్కు చెదరని అందంతో కుర్రాళ్ల మతి పోగొడుతుంది. ఇక బద్రి తర్వాత ఈ హీరోయిన్ అనేక సినిమల్లో నటించినా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. ఆ తర్వాత కూడా అడప దడపా సినిమాల్లో నటిస్తూ కాలాన్ని వెల్లదీస్తూ వచ్చింది.
ఇక విషయం ఏంటంటే? అమీషా పటేల్ దేశీ మ్యాజిక్ అనే సినిమా చేసే క్రమంలో నిర్మాత అజయ్ కుమార్ సింగ్ ఆమెకు రూ.2.5 కోట్లు ఇచ్చాడట. ఆ తర్వాత సినిమా చేయకపోగా, తన డబ్బులు తిరిగి కూడా ఇవ్వలేదని నిర్మాత వాపోయాడు. ఈ నేపథ్యంలోనే అజయ్ కుమార్ సింగ్ అమీషా పటేల్ పై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అమీషా పటేల్ పై చీటింగ్ కేసు నమోదు చేశారు. దీనిని విచారించిన జార్ఖండ్ ట్రయల్ కోర్టు అమీషాపై నమ్మక ద్రోహం, మోసం వంటి సెక్షన్ల కింద కోర్టు సమాన్లు జారీ చేసినట్లు సమాచారం. దీనిని సవాల్ చేస్తూ అమీషా పటేల్ సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. సెక్షన్ 138 ప్రకారం ప్రొసీడింగ్ లు జరపాలని కోర్టు తెలిపినట్లు తెలుస్తోంది. ఇక ముందుకు ముందు ఈ కేసులో ఏం జరుగుతుందోనని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అమీషా పటేల్ పై వ్యవహారంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.