తెలుగు, హిందీ, తమిళ్ భాషల్లో సినిమాలు చేసిన ఓ స్టార్ హీరోయిన్, ప్రొడక్షన్ తమకు వసతి, ఆహారం, రవాణా కోసం ఎలాంటి బిల్లులు చెల్లించలేదని ఆరోపించింది. ఈ నేపథ్యంలో తాము పడిన కష్టాలను సోసల్ మీడియా ద్వారా వెల్లడించింది.
సోషల్ మీడియా వేదికగా తనకు జరిగిన అన్యాయం గురించి ఓ స్టార్ హీరోయిన్ పోస్ట్ చేయడంతో ఆ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ నటి ఎవరో కాదు.. అమిషా పటేల్. హృతిక్ రోషన్ ‘కహోనా ప్యార్ హై’ తో హీరోయిన్‌గా ఇంట్రడ్యూస్ అయింది. ఫస్ట్ ఫిలిం సూపర్ డూపర్ హిట్ అవడంతో దశ తిరిగిపోయింది. వెంటనే పవన్ కళ్యాణ్ ‘బద్రి’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ ముంబై భామ ‘నాని’, ‘నరసింహుడు’, ‘పరమవీర చక్ర’ వంటి సినిమాలు చేసింది కానీ స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకోలేకపోయింది. తర్వాత తమిళంలోనూ సినిమాలు చేసింది. కొద్ది కాలంగా హిందీలోనే నటిస్తోంది. త్వరలో ‘గదర్ 2’ తో ప్రేక్షకుల ముందుకు రానుంది.
సన్నీ డియోల్ పక్కన అమీషా నటించిన ‘గదర్ : ఏక్ ప్రేమ్ కథ’ సెన్సేషనల్ హిట్ అయింది. ఇది ఆమెకు రెండో హిందీ సినిమా. 1940 కాలంలో జరిగిన ప్రేమకథగా వచ్చిన ఈ మూవీకి సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. 23 ఏళ్ల తర్వాత ‘గదర్’ కి సీక్వెల్‌గా ‘గదర్ 2 : ది కథ కంటిన్యూస్’ తెరకెక్కుతోంది. ఇటీవల ఈ సినిమా లాస్ట్ షెడ్యూల్‌లో పాల్గొన్న అమీషా మూవీ యూనిట్‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది. మే నెలాఖరులో ‘గదర్ 2’ నిర్మాణ సంస్థ తీరుపట్ల అసహనం వ్యక్తం చేస్తూ వరుస ట్వీట్లు వేసింది. అనిల్ శర్మ ప్రొడక్షన్స్ తమకు వసతి, ఆహారం, రవాణా కోసం ఎలాంటి బిల్లులు చెల్లించలేదని ఆరోపించింది. ఈ నేపథ్యంలో తాము పడిన కష్టాలను సోసల్ మీడియా ద్వారా వెల్లడించింది.
‘మేకప్ ఆర్టిస్టులు, కాస్ట్యూమ్ డిజైనర్స్, టెక్నీషియన్స్, ఇతర సిబ్బందికి సరైన వేతన బకాయిలు చెల్లించలేదు. షూటింగ్ చివరి రోజు చండీగఢ్ ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లేందుకు, ఫుడ్‌కి డబ్బులివ్వలేదు సరికదా నటీనటులు, సిబ్బందికి కార్లు కూడా ఏర్పాటు చేయలేదు. అక్కడే ఒంటరిగా వదిలేశారు. అయితే వెంటనే జీ స్టూడియోస్ వారు రంగంలోకి దిగి అన్ని పెండింగ్ బిల్స్ క్లియర్ చేసేశారు. అనిల్ శర్మ ప్రొడక్షన్స్ తప్పులను వారు సరిదిద్దారు’ అంటూ దీనికి కారణమైన వారికి పేరు పేరునా థ్యాంక్స్ తెలిపింది. అలాగే జీ స్టూడియోస్ టీమ్ ఎప్పుడూ అగ్రస్థానంలోనే ఉంటుందని తన ట్వీట్‌లో పేర్కొంది అమీషా పటేల్.
All involved in the film are aware that the production of GADAR 2 was being handled by ANIL SHARMA PRODUCTIONS which unfortunately misfired numerous times but @ZeeStudios_ always rectified issues!! A special thanks to them especially Shariq Patel,Neeraj Joshi, Kabeer Ghosh and…
— ameesha patel (@ameesha_patel) June 30, 2023