బాలీవుడ్ లో ‘కహో నా ప్యార్ హై’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అమీషా పటేల్ తర్వాత తెలుగు లో కూడా కొంతకాలం తన హవా కొనసాగించింది. స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది.
తెలుగు ఇండస్ట్రీలోకి బాలీవుడ్ హీరోయిన్లు ఎంతోమంది వచ్చారు.. కానీ సక్సెస్ అతి కొద్దిమందే అందుకున్నారు. అలాంటి వారిలో అమిషా పటేల్ ఒకరు. 2000 ‘కహో నా ప్యార్ హై’ మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్ లో మంచి సక్సెస్ అందుకున్న అమీషా పటేల్ తెలుగు లో కూడా నటించింది. నేడు ఓ కేసులో అమీషా పటేల్ కోర్టులో సరెండర్ అయ్యింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
బాలీవుడ్ బ్యూటీ అమీషా పటేల్ ‘కహో నా ప్యార్ హై’హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ మూవీస్ లో నటించింది. పవన్ కళ్యాణ్ నటించిన బద్రి మూవీతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత నరసింహుడు, నాని, పరమవీర చక్ర మూవీస్ లో నటించింది. ఈ రోజు అమీషా పటేల్ చెక్ బౌన్స్ కేసులో రాంచీ సివిల్ కోర్టులో లొంగిపోయింది. ప్రముఖ నిర్మాత, వ్యాపార వేత్త అయిన అజయ్ కుమార్ సింగ్.. అమీషా పటేల్ పై చెక్ బౌన్స్ కేసు వేశారు. గతంలో తన వద్ద అమీషా పటేల్ రూ.2.5 కోట్లు అప్పగా తీసుకుందని.. కానీ సినిమా మాత్రం పూర్తి చేయలేదని, తిరిగి డబ్బు ఇవ్వమని కోరితే వివిధ కారణాలు చెప్పి తప్పించుకుంటుందని తన పిటీషన్ లో పేర్కొన్నాడు.
అమీషా పటేల్ ఇప్పుడు అసలు రూ.2.5 కోట్లకు గాను వడ్డీ రూ.50 లక్షలు కలిపి మొత్తం రూ.3 కోట్లు ఇప్పించాలని కోర్టును కోరాడు. ఈ కేసు విచారణ చేసిన కోర్టు ఏప్రిల్ 6న అమీషాకు వారెంట్ ఇష్యూ చేయగా నేడు ఆమె కోర్టులో లొంగిపోయింది. తర్వాత కోర్టు పరలు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కోర్టు నుంచి అమీషా పటేల్ బయటకు వచ్చే సమయంలో మీడియా వాళ్లు ఎగబడ్డారు. దీంతో ఆమె తలకు ముసుగు కప్పుకొని ఎవరినీ పట్టించుకోకుండా కారులో అక్కడ నుంచి వెళ్లిపోయింది. అమీషా ముసుగులో కోర్టు నుంచి బయటకు రావడానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.
बिहार अभिनेत्री अमीषा पटेल ने रांची की सिविल कोर्ट में किया सरेंडर, मामला चेक बाउंस से जुड़ा है ,कोर्ट ने उन्हें 21 जून को दोबारा पेश होने का निर्देश दिया है ,,,,
Amisha Patel | #AmishaPatel@KaushikiDubey8 pic.twitter.com/j6wPnxv1q0
— manishkharya (@manishkharya1) June 17, 2023