తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలందరి మధ్య స్నేహం చిగురిస్తోంది. ఒకరి సినిమా పంక్షన్లకు మరొకరు రావడం, అందరూ కలసి పార్టీలు చేసుకోవడం ఈ మధ్య పరిపాటి అయిపోయింది. ఇక ఇద్దరు స్టార్ హీరోలు కలసి ఒకే సినిమాలో కనిపించబోతున్నారు అనేది నిజంగా చాలా పెద్ద వార్త. ప్రస్తుతం ఇలాంటి అద్భుతానికి రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, సూపర్ స్టార్ మహేష్ కాంబినేషన్ లో ముచ్చటగా మూడో మూవీ తెరక్కుతోన్న విషయం తెలిసిందే. చాలా ఏళ్ల తర్వాత ఇద్దరూ కలిసి సినిమా చేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే స్పెషల్ బజ్ ఏర్పడింది. అయితే ఇప్పుడు ఈ మూవీకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకి వచ్చింది.
త్రివిక్రమ్.. మహేష్ కాంబోలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓ గెస్ట్ రోల్ లో నటిస్తారని టాక్ వినిపిస్తోంది. గతంలో పవన్ కళ్యాణ్ జల్సా సినిమా కోసం మహేష్ చేత వాయిస్ ఓవర్ ఇప్పించాడు త్రివిక్రమ్. దీనికి అటు పవన్, ఇటు మహేష్ ఫ్యాన్స్ నుంచి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఇప్పుడు అదే మేజిక్ రిపిట్ చేయాలనుకుంటున్నాడట త్రివిక్రమ్. అందుకే ఈ సారి రివర్స్‌లో పవర్ స్టార్‌ను మహేష్ కోసం ఉపయోగించుకోబోతునేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది
మహేష్ సినిమా కోసం ఏకంగా పవన్ కెమియో ఒకటి ప్లాన్ చేస్తున్నాడట త్రివిక్రమ్. మాములుగానే పవన్, మహేష్ సినిమాలంటేనే క్రేజ్ వేరేలా ఉంటుంది. అలాంటి ఇద్దరూ ఒకే స్క్రీన్ పై కనబడితే ఆ లెక్క వేరేలా ఉంటుందంటున్నారు ఫ్యాన్స్. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో పవన్ ఓ సర్ ప్రైజ్ రోల్ లో కనిపిస్తారని టాక్. అయితే ఈ విషయాన్ని చిత్రయూనిట్ సీక్రెట్ గా ఉంచాలని ప్లాన్ చేసుకున్నారట. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవన్ ను పిలిచి ఆ టైం లో తన పాత్ర గురించి లీక్ చేస్తారని తెలుస్తోంది. కానీ.., ఎంత సీక్రెట్ గా ఉంచినా.., ఇంత హ్యుజ్ న్యూస్ బయటకి రాకుండా ఎలా ఉంటుంది? ఇకనైనా ఈ విషయంలో మూవీ యూనిట్ నుండి అధికారిక ప్రకటన వెలువడుతుందేమో చూడాలి.