నందమూరి బాలకృష్ణ అభిమానులకు దర్శకుడు బోయపాటి శ్రీను సారీ చెప్పారు. ‘సింహా’, ‘లెజెండ్’ వంటి బిగ్గెస్ట్ హిట్స్ తర్వాత నటసింహం బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం ‘అఖండ’. ఈ సినిమా ఇప్పటికే విడుదలై ఘన విజయం సాధించడంతో ఫుల్లు ఖుషీలో ఉన్నారు హీరో బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి. ఈ సినిమా విడుదలైన అన్ని ఏరియాల్లో భారీ కలెక్షన్స్ ను కొల్లగొట్టింది. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ, బోయపాటితో పాటు చిత్ర బృందం పాల్గొన్నారు.
ఇక చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ కార్యక్రమంలో బోయపాటి మాట్లాడుతూ.. అభిమానులను ఈ ఈవెంట్ కు పిలవలేకపోయినందుకు క్షమించాలని అన్నారు. “కరోనా థర్డ్ వేవ్ ప్రారంభమయిందని… సక్సెస్ మీట్ కు రమ్మంటే అభిమానులు ఏమాత్రం ఆలోచించకుండా వచ్చేస్తారని, వాళ్లు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశ్యంతోనే ఈవెంట్ కు పిలవలేదని చెప్పారు. ఫ్యాన్స్ బాగుండాలనే వారిని పిలవలేదని అన్నారు. ఈవెంట్ కు పిలవనందుకు తమను క్షమించాలని కోరారు”.
ఇది కూడా చదవండి : హాట్ నెస్ నా థైస్ లో కాదు.. మీ కళ్లలోనే ఉంది
‘విధికి, విధాతకు, విశ్వానికి సవాళ్లు విసరకూడదు’ , ‘అంచనా వేయడానికి నువ్వేమైనా పోలవరం డ్యామా? పట్టిసీమ తూమా? పిల్లకాలువ’ , ‘ఒక మాట నువ్వంటే అది శబ్ధం, అదే మాట నేనంటే శాసనం, దైవ శాసనం” అంటూ పలు డైలాగ్స్ తో తనలోని మాస్ డైరెక్టర్ యాంగిల్ తో మరోసారి అభిమానులను అలరించాడు బోయపాటి.