హాట్‌ నెస్‌ నా థైస్‌ లో కాదు.. మీ కళ్లలోనే ఉంది

ఫిల్మ్ డెస్క్- రాంగోపాల్ వర్మను ఎప్పుడైతే ఇంటర్వూ చేసిందో.. అదిగో అప్పటి నుంచి బాగా పాపులర్ అయ్యింది అషూ రెడ్డి. అంతకు ముందు బిగ్ బాస్ రియాల్టీ షో తో కొంత మేర వచ్చిన క్రేజ్, ఆర్జీవీతో బోల్డ్ ఇంటర్వూ తరువాత అమాంతం పెరిగిపోయింది. అదిగో అక్కడి నుంచి అషూ రెడ్డి ఏమాత్రం తగ్గడం లేదు. తన అంద చందాలతో కవ్విస్తూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూనే ఉంది.

అషు రెడ్డి హాట్‌ హాట్‌ గా ఫొటో షూట్‌ లకు ఫోజులు ఇచ్చి, వాటిని షేర్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. మరోవైపు తన బోల్డ్‌ కంటెంట్‌ పై వీడియో చేసి తన యూట్యూబ్‌ చానల్‌ లో షేర్‌ చేస్తూ ఎప్పటికప్పుడు ట్రోల్స్‌ బారిన పడుతోంది. తనపై వచ్చే హాట్‌ కామెంట్స్‌ కు తనదైన శైలిలో రిప్లై ఇచ్చి నెటిజన్లకు కౌంటర్‌ ఇస్తూ వస్తోంది అషూ రెడ్డి.

Ashu 1

ఇదిగో ఈ క్రమంలో అషూ రెడ్డి తన తాజా ఫొటో షూట్‌ ను సోషల్ మీడియాలో షేర్‌ చేసింది. తన ఫొటోలపై బోల్డ్‌ కామెంట్‌ చేస్తూ ఇన్‌ స్టాగ్రామ్‌ లో ఫొటోలు షేర్‌ చేసింది. తన ఫొటోలపై నెటిజన్లు చేసే కామెంట్స్‌ను ముందుగానే గ్రాహించిన అషూ రెడ్డి, ట్రోలర్స్‌కు ఆ చాన్స్‌ ఇవ్వకుండా ముందు జాగ్రత్తపడింది. నెటిజన్స్ కామెంట్స్ కంటే ముందే తాను కామెంట్ చేసింది.

ఈ మేరకు ఆమె.. హాట్‌ నెస్‌ నా థైస్‌ లో కాదు.. మీ కళ్లలోనే ఉంది.. అంటూ బోల్డ్‌ క్యాప్షన్‌ తో మోకాళ్లపైకి టాప్‌ ధరించిన ఫొటోలను షేర్ చేసింది అషూ రెడ్డి. ఇంకేముంది ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. అషూ రెడ్డి ఫోటో, పోస్ట్‌పై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్‌ చేస్తున్నారు. అషూ రెడ్డి అంటే అంతే కదా మరి, ఏంచేసినా చిరిగి చాటవుతుంది.

 

View this post on Instagram

 

A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu)