టాలీవుడ్ ఇండస్ట్రీకి 2021 మిశ్రమ ఫలితాలనే అందించిందని చెప్పాలి. కలెక్షన్స్ పరంగా USA బాక్సాఫీస్ వద్ద పుంజుకోవడానికి చాలా నెలలు పట్టింది. USA మార్కెట్ డల్ గా ఉన్న సమయంలో కామెడీ ఎంటర్‌టైనర్ “జాతిరత్నాలు” సినిమా విడుదలై మంచి వసూళ్లు రాబట్టుకుంది. 2021 ప్రథమార్థంలో మిలియన్ డాలర్లను దాటిన ఏకైక తెలుగు సినిమాగా జాతిరత్నాలు నిలిచింది. నిజానికి 2021 సెకండాఫ్ లో విడుదలైన తెలుగు సినిమాలకు జాతిరత్నాలు కొత్త ఆశలు కల్పించింది.
2021 చివరి మూడు నెలలలో.. లవ్ స్టోరీ, అఖండ, పుష్ప, శ్యామ్ సింఘరాయ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, వరుడు కావలెను సినిమాలు USA మార్కెట్ లో మంచి వసూళ్లు సాధించాయి. ఇక ఏడాది మొదట్లో రిలీజైన క్రాక్, ఉప్పెన, వకీల్ సాబ్ సినిమాలు టాలీవుడ్ లో బ్లాక్‌బస్టర్ హిట్స్ అయినప్పటికీ, USAలో తెలుగు ప్రేక్షకులను మాత్రం అంతలా ఆకర్షించలేకపోయాయి. అయితే. వాస్తవానికి 2021 చివరిలోనే ప్రేక్షకులు సినిమాలను థియేటర్లకి వచ్చి చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
ఈ ఏడాది USAలో మంచి కలెక్షన్స్(డాలర్స్) రాబట్టిన సినిమాలు ఇవేనట:
పుష్ప – $2,242,883
లవ్ స్టోరీ – $1,258,045
జాతిరత్నాలు – $1,057,538
అఖండ – $1,001,755
వకీల్ సాబ్ – $743,073
శ్యామ్ సింఘా రాయ్ – $650,000
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ – $536,110
రంగ్ దే – $341,425
ఉప్పెన – $198,958
వరుడు కావలెను – $175,566
మరి 2022లో అయినా టాలీవుడ్ నుండి అన్ని సినిమాలు USAలో సత్తా చాటుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఇండస్ట్రీ వర్గాలు. మరి USAలో తెలుగు సినిమాలు సాధిస్తున్న రికార్డు కలెక్షన్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ చేయండి.