నటి పునర్నవి.. 'బిగ్ బాస్'తో ఫేమ్ తెచ్చుకుంది. ప్రస్తుతం విదేశాల్లో ఉంటోంది. తాజాగా ఆమె ప్రెగ్నెంట్ అని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆమెనే వీటిపై క్లారిటీ ఇచ్చేసింది. బోల్డ్ రిప్లయ్ తో నోరు మూయించేసింది.
పునర్నవి పేరు చెప్పగానే.. ‘బిగ్ బాస్’ బ్యూటీ అని టక్కున గుర్తుపట్టేస్తారు. ‘ఉయ్యాలా జంపాలా’ మూవీతో నటిగా మారిన ఈమె.. తెలుగులో పలు సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ‘బిగ్ బాస్’లో జంటగా పాపులర్ అయిన ఈమె.. ప్రస్తుతం లండన్ లో ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ లో పునర్నవి ప్రెగ్నెన్సీ ఉందనే వార్తలొచ్చాయి. దానికి కారణం కూడా లేకపోలేదు. ఫారెన్ లో ఉంటుంది కాబట్టి.. ఫ్రెండ్స్ కచ్చితంగా ఉంటారు. అందులో అబ్బాయిలు కూడా ఉన్నారు. అలా ఈ మధ్య ఒకతనితో క్లోజ్ గా తీసుకున్న ఫొటోలను పునర్నవి తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఇదే ఈ ఇష్యూ మొత్తానికి కారణమైందా అనిపించింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. టీనేజ్ లో మూవీస్ లోకి వచ్చిన పునర్నవి హయ్యర్ స్టడీస్ చేసేందుకు కొన్నేళ్ల క్రితం లండన్ వెళ్లిపోయింది. విదేశాల్లో ఉంటుందనే పేరే గానీ అభిమానులతో ఎప్పుడూ టచ్ లోనే ఉంటుంది. ఫ్రెండ్స్, పార్టీస్ కు సంబంధించిన పోస్టులు పెడుతూ అలరిస్తూ ఉంటుంది. అయితే ఓ అబ్బాయితో తీసుకున్న ఫొటోల్ని రెండుమూడు సార్లు పోస్ట్ చేసింది. దీంతో పునర్నవి, అతడి రిలేషన్ లో ఉన్నారేమోనని అందరూ అనుకున్నారు. ఈ క్రమంలోనే పునర్నవి పొట్ట కాస్త ఎత్తుగా కనిపించేసరికి ప్రెగ్నెన్సీ అని రాసుకొచ్చేశారు. ఆ నోటా ఈ నోటా పడి ఈ న్యూస్ కాస్త పునర్నవి వరకు వెళ్లింది. దీంతో స్వయానా ఆమెనే రెస్పాండ్ అయింది.
ఏ ఇండస్ట్రీ అయినా సరే నటీనటులపై రూమర్స్ రావడం చాలా కామన్. చిన్నచిన్నవి అయితే వాళ్లు పెద్దగా పట్టించుకోరు. ఇప్పుడు ఏకంగా తనకు ప్రెగ్నెన్సీ అనేసరికి చాలా సీరియస్ అయిపోయింది. ‘నాన్ సెన్స్.. గే బెస్టీ వల్ల నాకు గర్భం వచ్చిందని యూట్యూబ్ న్యూస్ లో డిసైడ్ చేశారు. గత నెలలో అనారోగ్యంతో ఉన్నాను. ఇప్పుడు ప్రెగ్నెన్సీ అంటున్నారు. మీకు ఏం అర్థం కాలేదు యూట్యూబ్ ఫ్రెండ్స్?’ అని కొట్టిపారేసింది. ఈ మొత్తాన్ని తన ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. మరి పునర్నవిపై వార్తలు, ఆమె క్లారిటీ ఇవ్వడంపై మీరేం అంటారు. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.