స్రవంతి చొక్కారపు… యూట్యూబ్ ఛానల్ లో యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన ఈమె తక్కువ కాలంలో ఫేమస్ అయింది. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేయడంతో ఈ యాంకరమ్మ కాస్త అందరి దృష్టిలో పడింది. అలా మెల్ల మెల్లగా యూట్యూబ్ లో యాంకరింగ్ చేస్తున్న క్రమంలోనే ఆమెకు బిగ్ బాస్ ఓటీటీలో పాల్గొనే అవకాశం తలుపు తట్టింది.
వచ్చిన అవకాశాన్ని వడిసిపట్టుకున్న స్రవంతి హౌస్ లో అడుగు పెట్టి తన ఆట తీరుతో అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకుంది. ఆ తర్వాత కొంత కాలానికి హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది. ఇక అప్పటి నుంచి స్రవంతి గ్లామర్ డోస్ ను రోజు రోజుకు పెంచేస్తూ హాట్ హాట్ ఫోటో షూట్ లతో సోషల్ మీడియానే షేక్ చేస్తుంది. ఫొటో షూటే పనిగా పెట్టుకుని ఈ బిగ్ బాస్ బ్యూటీ తన అందచందాలతో కుర్రకారు మతి పోగొడుతుంది. ఇలా చేస్తూనే బుల్లితెరపై చిన్న చిన్న షోలలో అక్కడక్కడ మెరుస్తుంది.
ఇదిలా ఉంటే ఈ బ్యూటీ తాజాగా సోషల్ మీడియాలో భర్తతో పాటు బెడ్ రూంలో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ డేట్ నైట్ విత్ మై లవ్ అంటూ అంటూ రాసుకొచ్చింది. తాజాగా స్రవంతి పోస్ట్ చేసిన ఈ ఫొటోలు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతున్నాయి. స్రవంతి పోస్ట్ చేసిన ఈ పొటోలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Allu Arjun: అల్లు అర్జున్ స్టైలిష్ లుక్.. వైరల్ అవుతున్న ఫొటో!