ప్రస్తుతం సోషల్ మీడియా కాలం నడుస్తోంది. అందుకే ప్రపంచంలోని ఓ మూలన ఏమి జరిగిన కూడా క్షణాల్లో తెలిసి పోతుంది. అలానే సినీ, రాజకీయ ప్రముఖలకు సంబంధించిన విషయాలు, వారి తాలుక పాత జ్ఞాపకాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతుంటాయి.
ప్రస్తుతం సోషల్ మీడియా కాలం నడుస్తోంది. అందుకే ప్రపంచంలోని ఓ మూలన ఏమి జరిగిన కూడా క్షణాల్లో తెలిసి పోతుంది. అలానే సినీ, రాజకీయ ప్రముఖలకు సంబంధించిన విషయాలు, వారి తాలుక పాత జ్ఞాపకాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతుంటాయి. ఇక ఇటీవల కాలంలో సినీ, రాజకీయ రంగాలకు చెందిన వారి చిన్నతనంలోని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. ప్రస్తుతం ఓ రాజకీయ నాయకుడి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నూనుగు మీసాలతో ఉన్న ఆ బాలుడు.. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రంలో మోస్ట్ పవర్ ఫుల్ మ్యాన్ గా ఉన్నాడు.
ప్రస్తుతం ఆ పొలిటికల్ లీడర్ త్రో బ్యాక్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆయన ఎన్నో కష్టాలు పడి నేడు ఓ రాష్ట్రానికి సీఎంగా ఉండటమే కాకుండా దేశంలోని ప్రముఖ రాజకీయ నాయకులు ఒకరిగా గుర్తింపు పొందారు. ప్రత్యర్థులు ఎన్ని కష్టాలు పెట్టిన కూడా అన్నింటిని ఓర్చుకుని ప్రజల కోసం నిలబడ్డాడు. 2019లో జరిగిన ఎన్నికల్లో చరిత్రలో కనివిని ఎరుగని విజయం సాధించారు. ఇంతకి ఆయన ఎవరు అనే కదా సందేహం.. ఆయన ఎవరో కాదు.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.
ఆయన.. తన చిన్ననాటి ఫోటోలో ఎంతో అందంగా, రాజసంగా కనిపిస్తున్నారు. నూనూగు మీసాలతో జగన్ మోహనుడు.. ప్రత్యేకంగా కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ను సంక్షేమ పథంలో జగన్ మోహన్ రెడ్డి తీసుకెళ్తున్నారు. జగన్ గారు 2011 లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెట్టి ప్రజలలోకి వచ్చిన సంగతి తెలిసిందే. 2019 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ అఖండ మెజారిటీ తో గెలుపొందడం జరిగింది. ఇక 2024లోనూ మరోసారి అధికారంలోకి వస్తానని ధీమ వ్యక్తం చేస్తున్నారు. మరి..సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిన్ననాటి ఫోటోలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.