నటీనటులు తమ ఇంట జరిగే శుభకార్యాలకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటారు. తాజాగా హాస్య బ్రహ్మి.. బ్రహ్మానందం ఇంట పెళ్లి సందడి మొదలైంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.
సెలబ్రిటీలకు సంబంధించిన వార్తలను తెలుసుకునేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపిస్తుంటారు. సెలబ్రిటీల పెళ్లిళ్ళు, ఇతర వేడుకలు వంటి వాటిని తెలుసుకునేందుకు వారి అభిమానులు ఎంతగానే ఎదురు చూస్తుంటారు. అలానే నటీనటులు కూడా తమ ఇంట జరిగే శుభకార్యాలకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటారు. తాజాగా హాస్య బ్రహ్మి.. బ్రహ్మానందం ఇంట పెళ్లి సందడి జరుగుతుంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.
బ్రహ్మానందం.. ఇది తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. తనదైన కామెడీతో చిత్ర పరిశ్రమలో హాస్య బ్రహ్మగా గుర్తింపు పొందరు బ్రహ్మానందం. ఎన్నో వందల చిత్రాల్లో నటించి.. కామెడీ సామాజ్రానికి రారాజులాగా నిలిచిపోయారు. ఆయన తన కామెడీతో ఎందరో ఇళ్లలో సందడి చేశారు. తాజాగా ఆయన ఇంట పెళ్లి సందడి మొదలైంది. బ్రహ్మానందం రెండో కుమారుడు సిద్ధార్థ నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. ఐశ్వర్య అనే వైద్యురాలితో సిద్దార్థ ఎంగేజ్మెంట్ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు కమెడియన్ ఆలీ, సుబ్బిరామిరెడ్డి సహా పలువురు సినీ సెలబ్రిటీలు విచ్చేసి నూతన జంటను ఆశీర్వదించారు. ప్రస్తుతం సిద్ధార్థ, ఐశ్వర్యల నిశ్చితార్థ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఆయన అభిమానులు కూడా కాబోయే వధువరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. బ్రహ్మానందంకు ఇద్దరు కొడుకులున్న సంగతి అందరికి తెలిసిందే. పెద్ద కుమారుడు గౌతమ్.. పల్లకిలో పెళ్లికూతురు సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా మంచి హిట్ సొంతం చేసుకుంది. అలానే గౌతమ్ కి మంచి పేరు తెచ్చి పెట్టింది. ఆ మూవీ ఇచ్చిన విజయంతో ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించారు. గౌతమ్‌కు పెళ్లై పిల్లలు కూడా ఉన్నారు. బ్రహ్మానందం చిన్న కొడుకు సిద్దార్థ్ విదేశాల్లో చదువుకొని అక్కడే ఉద్యోగం చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా అతడు కూడా త్వరలో ఓ ఇంటివాడుకానున్నాడు. ప్రస్తుతం బ్రహ్మానందం చిన్న కుమారుడి నిశ్చితార్ధ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.