తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 ఎట్టకేలకు మొదలైంది. బిగ్ బాస్-5 కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న కింగ్ నాగార్జున అందరికన్నా ముందుగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈసారి బిగ్ బాస్ హౌస్ ఎలా ఉందో.. ప్రేక్షకులకి క్లియర్ గా చూపించారు. ఇక సీజన్ 5 లో నాలుగో కంటెస్టెంట్ గా.. సింగర్ శ్రీరామ్ చంద్ర హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. దీంతో.. ఇప్పుడు శ్రీరామ్ చంద్ర బయోడేటా గురించి తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు.
శ్రీరామ్ చంద్ర గురించి మ్యూజిక్ లవర్స్ కి ప్రత్యేకంగా పరిచయం అవసరం ఉండదు. 9 భాషల్లో కలిపి మొత్తం 500కు పైగా పాటలు పాడిన ఘనత శ్రీరామ్ చంద్ర సొంతం. ఇక 2010లో ఇండియన్ ఐడల్ షో విన్నర్‌గా నిలిచిన శ్రీరామచంద్ర దేశ వ్యాప్తంగా తెలుగు వారి సత్తా చాటి చెప్పారు. ఇక శ్రీరామచంద్ర వ్యక్తిగత విషయాలకి వస్తే..
శ్రీరామచంద్ర పూర్తి పేరు మైనంపాటి శ్రీరామచంద్ర. ప్రకాశం జిల్లాలోని అద్దంకి ఇతని సొంత ఊరు. వీరి తండ్రి ప్రసాద్ హైకోర్టులో న్యాయవాదిగా పని చేస్తుండటం విశేషం. చిన్నప్పటి నుంచీ శ్రీరామచంద్రకి సంగీతమంటే ప్రాణం. ఆ ఇష్టమే శ్రీరామ్ ని స్టార్ సింగర్ ని చేసింది.
సంజయ్‌దత్, జాన్ అబ్రహాంలతోపాటు హేమమాలిని, బిపాసా బసు, కత్రినా కైఫ్, ప్రియాంక చోప్రా లాంటి బాలీవుడ్ స్టార్స్ అంతా శ్రీరామచంద్ర పాటలకి అభిమానులు కావడం విశేషం. కేవలం సింగర్ గా మాత్రమే కాకుండా.., శ్రీరామచంద్ర కొన్ని సినిమాల్లో కూడా నటించాడు. సల్మాన్‌ఖాన్‌తో కలసి నటించిన సుజుకీ అడ్వైర్టెజ్‌మెంట్ ఇతనికి మంచి పేరు తెచ్చి పెట్టింది. మరి.. టాలీవుడ్ టూ బాలీవుడ్ లోని స్టార్స్ తో మంచి పరిచయాలు ఉన్న శ్రీరామచంద్ర.. బిగ్ బాస్ సీజన్ 5 టైటిల్ విన్నర్ గా నిలవగలడని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.
(ముఖ్య గమనిక : అతి తక్కువ సమయంలో.. మాకు అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందించడం జరిగింది. )