సినీ ఇండస్ట్రీ అన్నాక హీరోయిన్స్ ఫామ్ లో ఉన్నా లేకపోయినా.. పెళ్ళైనా కాకపోయినా గ్లామర్ షోలో మాత్రం ఏమాత్రం వెనకడుగు వేయట్లేదు. హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసి.. పెళ్లి చేసుకొని సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ, సోషల్ మీడియాలో అందాల ప్రదర్శనకు అడ్డుతెర తొలగిస్తున్నారు. ప్రస్తుతం అదే బాటలో వెళ్తోంది నటి భూమిక చావ్లా.
ఇది చదవండి: ‘ఆచార్య’ మూవీ రివ్యూ!
ఈ ఢిల్లీ బ్యూటీ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించిన ‘ఖుషీ’ సినిమాతో యూత్ మనసు దోచుకున్న భూమిక.. ఆ తర్వాత మిస్సమ్మ సినిమాతో నంది పురస్కారం అందుకొని ఫ్యామిలీ ఆడియెన్స్ కి మరింత దగ్గరైంది. 2000లో యువకుడు మూవీతో సినీ కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ.. తెలుగులో దాదాపు అందరూ స్టార్ హీరోల సరసన సినిమాలు చేసింది.
మెగాస్టార్ చిరు, బాలయ్య, వెంకటేష్, నాగ్ మొదలుకొని.. మహేష్, పవన్, ఎన్టీఆర్ ఇలా అందరితో భారీ హిట్స్ అందుకుంది. అయితే.. మొదటి నుండి భూమిక గ్లామర్ షోలో ఏమాత్రం తగ్గలేదు. ఇక సౌత్ లోని అన్ని భాషలతో పాటు హిందీ, భోజ్ పురిలో కూడా సినిమాలు చేసింది. అనంతరం 2007లో స్నేహితుడు భరత్ ఠాకూర్ ని పెళ్లాడి సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టింది.
ప్రస్తుతం వరుసపెట్టి సినిమాలు చేయకపోయినా.. సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటోంది. అదీగాక నలభైయేళ్లు పైబడ్డాక.. ఫ్యాన్స్ అందరూ కళ్లప్పగించి ఉండిపోయే రేంజిలో అందాల ప్రదర్శన చేస్తోంది. ఇటీవలే స్విమ్మింగ్ పూల్ ఫోటోషూట్ తో మతులు పోగొట్టిన భూమిక.. తాజాగా ఓ హాట్ ఫోటో పోస్ట్ చేసింది. బ్లాక్ షాట్ – టైట్ టాప్ వేసుకొని నెట్టింట సెగలు రేపే ప్రయత్నం చేస్తోంది. ఇండస్ట్రీలో 20ఏళ్లు పూర్తయినా.. లేటు వయసులో ఘాటు అందాల షో అదిరిందంటూ భూమిక పిక్ పై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి భూమిక లేటెస్ట్ హాట్ పిక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.