వెండితెర, బుల్లితెరపై నటించి తమకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న కొంతమంది నటీనటులు అకస్మాత్తుగా ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి.
వెండితెర, బుల్లితెరపై ఒక్క ఛాన్సు వస్తే చాలు మంచి సెలబ్రెటీలో హూదా వస్తుందని ఎంతోమంది ఆశపడుతుంటారు. ఇందుకోసం ఎన్నో కష్టాలు పడుతుంటారు. ప్రతిరోజూ స్టూడియోల చుట్టూ తిరుగుతూ ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ పడిగాపులు కాస్తుంటారు. అదృష్టం కొద్ది సినిమా, టీవి ఛాన్సులు దక్కించుకునే వారు ఉంటారు. అయితే చాలా మంది అనుకున్నట్లు వెండితెర, బుల్లితెరపై నటించే నటీనటులు ఎంతో ఆనందంగా ఉంటారని.. రాజబోగాలు అనుభవిస్తుంటారని భావిస్తుంటారు. కానీ కొంతమంది నటీనటులు తమ జీవితాల్లో ఎన్నో కష్టాలు, కన్నీళ్లు ఉంటాయని పలు ఇంటర్వ్యూలో చెబుతుంటారు. అంతేకాదు.. జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యలు చేసుకున్నవారు కూడా ఉన్నారు. ఈ బుల్లితెర నటి ఆకాంక్ష దుబే ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.. ఈ కేసులో కొత్త ఆధారలు సంచలనం రేపుతున్నాయి. వివరాల్లోకి వెళితే..
ఎంతో మంచి భవిష్యత్ ఉన్న బుల్లితెర నటి ఆకాంక్ష దుబే ఈ ఏడాది మార్చి 26న వారణాసిలో ఆత్మహత్య చేసుకొని మరణించిన సంగతి తెలిసిందే. ఆకాంక్ష దుబే కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. అయితే ఆమె మృతిపై మొదటి నుంచి ఎన్నో రకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బోజ్పూరి టీవి సీరియల్స్ లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది ఆకాంక్ష దుబే. కుటుంబ సభ్యులు ఆమె బాయ్ ఫ్రెండ్ ప్రముఖ సింగర్ సమర్ సింగ్ అతడి సోదరుడు సంజయ్ పై ఫిర్యాదు చేయగా పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ఇక లోతుగా దర్యాప్తు చేస్తున్న క్రమంలో పలు కీలక విషయాలు బయటపడుతున్నాయి.
ఈ కేసులో పోలీసుల దర్యాప్తులో ఓ షాకింగ్ విషయం వెలుగు చూసింది. సూసైడ్ చేసుకున్న ఆకాంక్ష దుబే దుస్తులపై స్పెర్మోను పోలీసులు గుర్తించినట్లు తెలిపారు. అయితే స్పెర్మ్ ఆధారంగా మరిన్ని విషయంలు తెలియవొచ్చు అని.. ఈ క్రమంలో కోర్టు అనుమతి తీసుకుని అనుమానితులపై డీఎన్ఏ టెస్ట్ నిర్వహించబోతున్నట్లు పోలీసులు తెలిపారు. పరీక్షల కోసం ఆమె దుస్తులను ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ కేసులో మరో ఇద్దరు అనుమానితులు సందీప్, అరుణ్ పాండే లపై కూడా డీఎన్ఏ టెస్ట్ నిర్వహించబోతున్నట్లు తెలుస్తుంది. 25 ఏళ్ల ఆకాంక్ష దుబే ముజ్సే షాదీ కరోగి, వీరన్ కే వీర్, ఫైటర్ కింగ్ సినిమాల్లో కూడా నటించి గుర్తింపు తెచ్చుకుంది.