పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన భీమ్లా నాయక్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. పవన్ కళ్యాణ్ – రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ క్రమంలో భీమ్లా నాయక్ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరి గురుంచి మాట్లాడుకోవాలి. సినిమా అంటే.. హీరో, దర్శకుడు, ప్రొడ్యూసర్ అనే కాకుండా మాటలు, కొరియోగ్రాఫర్స్, కెమరామెన్, సింగెర్స్ ఇలా ప్రతి ఒక్కరి గురుంచి మాట్లాడుకోవాలి.
ఓ సినిమా విజయం సాధించింది అంటే.. దాని వెనుక 24 క్రాఫ్ట్స్ కృషి ఉంటుంది. ఇక సినిమా అనగానే చాలా మంది దృష్టిని ఆకర్షించేది డ్యాన్స్, పాటలు. ప్రేక్షకులును థియేటర్ వరకు రప్పించేది కూడా ఇవే. ప్రస్తుతం ప్రతి దర్శకుడు సినిమాలో డ్యాన్స్ లకు అధిక ప్రధాన్యం ఇస్తున్నారు. అలానే ప్రతి సినిమాలో ఏదో ఓ స్టెప్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. తాజాగా భీమ్లా నాయక్ సినిమాలో కూడా డ్యాన్స్ లను ప్రేక్షకులును అలరించాయి. సినిమా కూడా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది.ఈ క్రమంలో భీమ్లా నాయక్ సినిమాకు కొరియోగ్రఫి చేసిన గణేష్ మాస్టర్ గురుంచి పవన్ అభిమానులు చర్చించుకుంటున్నారు. భీమ్లా నాయక్ సినిమా సక్సెస్ సదర్భంగా సుమన్ టీవీ ఆయనతో ఇంటర్వ్యూ నిర్వహించింది. పవన్ కళ్యాణ్ గారితో షూటింగ్ స్పాట్ లో గణేష్ మాస్టర్ ఎలా ఉండేవారు, పవన్ కళ్యాణ్ తో స్టెప్స్ ఎలా వేయించారు అన్న విషయాలు మనతో పంచుకున్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూసి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.