యాక్షన్ లో మాస్.. డాన్స్ లో గ్రేస్.. ఎమోషన్స్ లో క్లాస్.. ఇలా అన్నివర్గాల సినీ ప్రేక్షకులను దాదాపు నాలుగు దశాబ్దాలుగా అలరిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆయన ప్రస్థానం యువతకు స్ఫూర్తిగా నిలుస్తుంది. ఖైదీ నెంబర్ 150 మూవీతో హీరోగా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన చిరు.. తాజాగా ఆచార్య సినిమాను విడుదలకు సిద్ధం చేశారు. దర్శకుడు కొరటాల శివ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
మాస్ క్లాస్ అంశాలతో తెరకెక్కిన ఆచార్య మూవీ ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే చిత్రబృందం ఆచార్య నుండి సాంగ్స్, టీజర్స్, ట్రైలర్ వదిలి మెగాఫ్యాన్స్ లో అంచనాలు పెంచేశారు. ఈ క్రమంలో తాజాగా మరో క్రేజీ మాస్ సాంగ్ రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుండి తాజాగా “భలే భలే బంజారా” అనే సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్.
మంచి మాస్ బీట్ ట్యూన్ తో సమకూర్చిన ఈ పాటలో మెగాస్టార్ చిరుతో పాటు మెగాతనయుడు రామ్ చరణ్.. ఇద్దరూ కలిసి స్టెప్పులు వేస్తుండటం విశేషం. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఈ పాటలో చిరు, చరణ్ ఇద్దరూ డాన్స్ రఫ్ఫాడించేశారు. అద్భుతమైన మాస్ బీట్ కి చిరు, చరణ్ చిందులు తోడైతే ఆ ఫీస్ట్ వేరే లెవెల్ లో ఉంటుందని ప్రోమో చూసినప్పుడే అర్థమైంది. ముఖ్యంగా మెగాఫ్యాన్స్ భలే భలే బంజారా సాంగ్ తో పండగ చేసుకోనున్నారనే చెప్పాలి.
ఈ సాంగ్ షూటింగ్ మెగాస్టార్ సతీమణి సురేఖ గారితో పాటు చాలామంది ఇండస్ట్రీకి చెందినవారు పాల్గొనడం విశేషం. చిరు, చరణ్ ఇద్దరు కూడా చాలా ఈజ్ తో జాలీగా సాంగ్ కి డాన్స్ చేశారు. అలాగే మణిశర్మ – చిరు కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బంజారా సాంగ్ లో మరోసారి మణిశర్మ మ్యాజిక్ రిపీట్ అయ్యిందని చెప్పవచ్చు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్ మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, పూజాహెగ్డే హీరోయిన్స్ గా కనిపించనున్నారు. మరి ఈ మెగా మూవీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.