అందం, అభినయంతో ఆకట్టుకునే నటీమణులు చాలా అరుదు. తొలి సినిమాతో సో.. సో అనిపించుకున్నా.. ఆ తర్వాత నటనపై ఫోకస్ పెంచుతారు. ముందు ఆఫర్ల కోసం గ్లామరస్ పాత్రలు, ఆ తర్వాత ప్రాధాన్యత ఉన్న పాత్రల వైపు మళ్లుతుంటారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకునే నటి కాస్త ప్రత్యేకం
అందం, అభినయంతో ఆకట్టుకునే నటీమణులు చాలా అరుదు. తొలి సినిమాతో సో.. సో అనిపించుకున్నా.. ఆ తర్వాత నటనపై ఫోకస్ పెంచుతారు. ముందు ఆఫర్ల కోసం గ్లామరస్ పాత్రలు, ఆ తర్వాత ప్రాధాన్యత ఉన్న పాత్రల వైపు మళ్లుతుంటారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకునే నటి కాస్త ప్రత్యేకం. నటించిన తొలి రెండు సినిమాలతోనే సెన్సెషన్ క్రియేట్ చేసింది. అర్థ నగ్న సీన్లలో నటించి ఔరా అనిపించింది. తన మత్తు కళ్లతోనే హోయలు పలికించి ఫిదా చేసేసింది. దీంతో కుర్రకారు అంతా ఆమె నామ స్మరణ చేసేవారు. ఆమె తెరపై కనిపించిందంటే చాలు మైమరిచిపోయేవారు. కానీ కొన్ని విమర్శల కారణంగా సినిమా తెరకు దూరమయ్యారు. ఆమె మరెవ్వరో కాదూ తేనె కళ్ల సుందరి మందాకిని
మందాకిని తెలుగు సినిమాల్లో కూడా కనిపించి కనివిందు చేశారు. మీరట్‌లో పుట్టిన ఈ అందాన్ని తెరపైకి తెచ్చారు ప్రముఖ దర్శక నిర్మాత రాజ్ కపూర్. రామ్ తేరీ గంగా మైలీ అనే సినిమాలో ఆమె నటనను చూసి మంత్రముగ్దులు అయ్యారు. ఆమె అసలు పేరు యాస్మిన్ జోసెఫ్ ఠాకూర్. ఆ తర్వాత తెలుగులో సూపర్ స్టార్ కృష్ణ తెరకెక్కించిన సింహాసనం, బాలకృష్ణతో భార్గవ రాముడులో నటించారు. బ్రహ్మరుద్రుల్లో వెంకటేష్ సరసన ఓ ప్రత్యేక పాటలో మెరిశారు. ఆ సమయంలో అనేక హిందీ సినిమాల్లో నటించి మెప్పించారు. 1990దశకంలో బాలీవుడ్‌ను శాసిస్తున్న డాన్ దావూద్ ఇబ్రహీంతో ఆమె ప్రేమాయణం సాగిందని వార్తలు వచ్చాయి.
దానికి కారణం.. వీరిద్దరూ కలిసి దుబాయ్ లో కనిపించే సరికి పుకార్లు షికార్లు చేశాయి. వీరిద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నారని, వీరికి ఓ కొడుకు కూడా అని మీడియా కోడై కూసింది. అయితే ఆమె ఈ వార్తలు ఖండిస్తూ వచ్చారు ఆమె. 1985-96 వరకు సినిమాల్లో కనిపించి తెరమరుగయ్యారు. మాజీ బౌద్ధ సన్యాసి డాక్టర్. కాగ్యూర్ టి. రింపోచే ఠాకూర్‌ను వివాహం చేసుకున్నారు. బౌద్ధమతాన్ని స్వీకరించారు. వీరికి ఇద్దరు పిల్లలు. ఓ కుమారుడు, కుమార్తె. సినిమాలకు గుడ్ బై చెప్పిన ఆమె మా ఓ మా అంటూ తన కొడుకు రబ్బిల్‌తో కలిసి ఓ ప్రైవేట్ సాంగ్ లో కనిపించారు. ఇటీవల కపిల్ కామెడీ షోలో సందడి చేశారు. ఇప్పటికీ కూడా అదే అందంతో మెరిసిపోతున్నారు మందాకిని.