బండ్ల గణేష్… రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి పెద్దగా పరిచయం అక్కర్లేని వ్యక్తి. తొలుత సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ.. ఆ తర్వాత కమెడియన్‌గా మారి.. ప్రస్తుతం నిర్మాతగా స్థిరపడ్డాడు. వీటన్నింటికంటే కూడా పవన్ కల్యాణ్ వీరాభిమానిగా తన గురించి తాను చెప్పుకుంటాడు. కొన్నాళ్లు రాజకీయాల్లో ఉన్నాడు.. కానీ అవి తనకు సెట్ కావని తెలిసి.. ప్రస్తుతం పూర్తిగా సినిమాల మీదనే తన దృష్టి కేంద్రీకరించాడు. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టీవ్‌గా ఉంటాడు బండ్ల గణేష్. ఏ అంశం మీదనైనా స్పందించే బండ్ల గణేష్.. ఓ విషయం గురించి మాత్రం తన దగ్గర అసలు ప్రస్తావించొద్దు అంటాడు. అభిమానులకు కూడా అదే సూచిస్తాడు. ఇంతకు బండ్ల గణేష్‌కు నచ్చని ఆ అంశం ఏంటో తెలియాలంటే.. ఇది చదవండి.
ఇది కూడా చదవండి: పవర్‌స్టార్‌పై మరోసారి అభిమానాన్ని చాటుకున్న బండ్ల గణేష్
తాజాగా ఓ అభిమాని ట్విట్టర్ వేదికగా బండ్ల గణేష్‌ను ఓ కోరిక కోరాడు. ‘గణేష్ అన్న మీరు బిజెపిలో చేరాలని నా కోరిక. నేను కూడా మీ అభిమానిని.. మీరు చాలా బాగా మాట్లాడతారు’ అని ట్వీట్ చేస్తే.. దానికి బండ్ల గణేష్ రియాక్ట్ అయ్యాడు. ‘ప్లీజ్.. రాజకీయాల గురించి వద్దు’ అని కామెంట్‌తో పాటు దండం పెట్టే ఎమోజీని కూడా షేర్ చేశాడు. బండ్ల గణేష్ ఇలా ఎందుకు రియాక్ట్ అయ్యాడో ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదు.
ఇది కూడా చదవండి: జనసేనలోకి మెగాస్టార్.. అభిమాని పోస్టుపై బండ్ల గణేష్ ట్వీట్..!
బండ్ల గణేష్ రాజకీయాల్లో చేరి.. కాంగ్రెస్‌లో జాయినయ్యాడు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలవకపోతే తాను బ్లేడుతో గొంతు కోసుకుంటానని ఆయన చేసిన ప్రతిజ్ఞ గతంలో బాగా వైరలయ్యింది. తీరా కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. దీంతో బండ్ల గణేష్‌ను అందరూ ట్రోల్ చేయడం ప్రారంభించారు. బండ్ల గణేష్ ఎక్కడ.. అంటూ ఆయన నివాసం దగ్గరకు వెళ్లే ప్రయత్నం కూడా చేశారట కొందరు. అప్పటి నుంచి ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. ఆ టాపిక్‌పై మాట్లాడటానికి కూడా ఇష్టపడటం లేదు. దాని ఎఫెక్టే ఈ ట్వీట్. బండ్ల గణేష్ చేసిన ట్వీట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
No politics please 🙏 https://t.co/a5jKRYkvG4
— BANDLA GANESH. (@ganeshbandla) April 15, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.