దర్శకధీరుడు రాజమౌళి సినిమాకోసం కేవలం తెలుగు రాష్ట్రాలే కాదు యావత్ ఇండియన్ సినీ ఫ్యాన్స్ ఎదురు చూస్తుంటారు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ దక్కించుకున్న రాజమౌళి.. తన ప్రతి సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తుంటారు. రాజమౌళి కొత్త సినిమా వచ్చి ఐదేళ్లు అవుతోంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రధారులుగా పాన్ ఇండియా మల్టీస్టారర్ ‘RRR’ రూపొందించాడు. ఈ సినిమా మార్చి 25న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతుంది.
ప్రస్తుతం రాజమౌళి RRR రిలీజ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. అయితే.. RRR తర్వాత రాజమౌళి.. సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మొదలవకముందే సినీ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. మహేష్ బాబు – రాజమౌళి సినిమాలో నటసింహం నందమూరి బాలకృష్ణ కీలకపాత్ర పోషించనున్నట్లు టాక్ నడుస్తుంది. రాజమౌళి ఎప్పటినుండో బాలయ్యతో సినిమా చేయాలని భావిస్తున్నా కానీ కుదరలేదని చెప్పాడు.ఇటీవల బాలయ్య హోస్ట్ చేసిన ‘అన్ స్టాపబుల్’ టాక్ షోలో పాల్గొన్న రాజమౌళి.. మహేష్ తో చేసే సినిమాలో మరో హీరోకి ఛాన్స్ ఉందని క్లూ వదిలాడు. ఇక ఆ హీరో ఎవరో కాదు.. బాలయ్యే అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపు 40 నిమిషాల పాటు స్కోప్ ఉన్న ఆ పాత్రను హీరో క్యారెక్టర్ కి ధీటుగా ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ టాక్. మరి ఆ పాత్ర గనక బాలయ్య చేస్తే.. మహేష్ – బాలయ్య ఫ్యాన్స్ కి ఐ-ఫీస్ట్ అవుతుందని భావిస్తున్నారు. మరి ఈ క్రేజీ కాంబినేషన్ పై అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. మరి ఈ విషయం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.