నందమూరి కుటుంబం నుంచి టాలీవుడ్ కి మరో హీరో పరిచయం కానున్నాడు. ఇప్పటికే బాలకృష్ణ, యంగ్ టైగర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ నందమూరి కుటుంబ నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. బాలకృష్ణ అయితే ఈ తరం హీరోలకు సైతం గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆయన నటించిన “అఖండ” చిత్రం ఘన విజయం సాధించింది. ఈక్రమంలోనే బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు చాలాకాలంగా ఎదురుస్తున్నారు. అప్పుడు.. ఇప్పుడు అంటూ కాలయాపనతో అభిమానల్లో కాస్త నిరాశ గురయ్యారు. ఈ క్రమంలో తాజాగా మోక్షజ్ఞ ఎంట్రీ పై క్లారిటీ వచ్చింది. ఓ డైరెక్టర్ తో మోక్షజ్ఞ డెబ్యూ మూవీ ఉండనున్నట్లు సమాచారం.
గతంలో మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కి పూరి జగన్ దర్శకత్వం వహించనున్నారని వార్తలు వచ్చాయి. అయితే పూరీ ఇతర ప్రాజెక్టలతో బిజీగా ఉండటంతో అది కష్టమైపోయింది. మరో ప్రక్క తనకు హాట్రిక్ హిట్స్ ఇచ్చిన ఈ డైరెక్టర్‌తోనే మోక్షజ్ఞ ఎంట్రీ జరగాలని సెంటిమెంటల్‌గా బాలయ్య ఫిక్సయ్యారట. అది అదీ నిజం కాలేదు. ఈ క్రమంలో మరొ డైరెక్టర్ పేరు తెరపైకి వచ్చింది. ఆ డైరెక్టర్ తో మోక్షజ్ఞ సినీ ఎంట్రీ చేస్తే బాగుటుందని బాలయ్య భావించినట్లు తెలుస్తోంది. భారీ కమర్షియల్ సినిమా కాకుండా సింపుల్ అండ్ క్లీన్ ఎంటర్టైనర్ తో మోక్షజ్ఞ ఎంట్రి ఉండాలని బాలయ్య భావిస్తున్నారని టాక్. అందుకే యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి చేతుల్లో మోక్షజ్ఞను పెట్టాలనుకుంటున్నారని తెలుస్తోంది.
ఇదీ చదవండి: కోరిక బయటపెట్టిన మిస్ వరల్డ్.. రామ్ చరణ్ తో డేట్..!అనిల్ సినిమాలు చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటాయి. అతడి సినిమాల్లో హీరోలు కామెడీ నుంచి యాక్షన్ సీన్స్ వరకు అన్నీ చేస్తారు. అలాంటి సినిమా అయితే మోక్షజ్ఞ టాలెంట్ ను నిరూపించుకునే అవకాశం ఉంటుందని.. తెలుగు ప్రేక్షకులు అతడి ప్రతిభను గుర్తిస్తారనేది బాలయ్య ఆలోచన. ఈ మధ్యకాలంలో వారసత్వంతో కంటే టాలెంట్ తోనే ఇండస్ట్రీలో రాణిస్తున్నారు చాలా మంది హీరోలు. అయితే అనిల్ రావిపూడి డెైరెక్షన్ లో మోక్షజ్ఞ ఎంట్రీ ఉండబోతున్నట్లు వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.