టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ.. ఇటీవల అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. అదే ఊపులో వరుసగా ఫ్యూచర్ ప్రాజెక్టులను కూడా లైనప్ చేసేశాడు. ప్రస్తుతం క్రాక్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో ఓ సినిమా, డైరెక్టర్ అనిల్ రావిపూడితో ఓ సినిమా ఓకే చేశాడు బాలయ్య. అయితే.. సినిమాలు మాత్రమే కాకుండా ఈ మధ్యే ఓటిటి ప్రేక్షకులను కూడా తన యాంకరింగ్ తో ఎంటర్టైన్ చేస్తున్నాడు.
బాలయ్య హోస్ట్ గా తెలుగు OTT ఆహాలో ‘అన్ స్టాపబుల్‘ అనే సెలబ్రిటీ టాక్ షో ప్రసారం అవుతోంది. మొదటి ఎపిసోడ్ నుండే ఎంతో ఉత్సాహంగా షోని తనదైన శైలిలో ముందుకు తీసుకెళ్తున్నాడు బాలయ్య. ఇప్పటివరకు ‘అన్ స్టాపబుల్’ షోలో మోహన్ బాబు, నాని, బ్రహ్మానందం, అనిల్ రావిపూడి, అఖండ టీమ్, రాజమౌళి, కీరవాణి, మాస్ మహారాజ రవితేజ, గోపీచంద్ మలినేని తదితరులు హాజరయ్యారు. అన్ స్టాపబుల్ షో కూడా చివరిదశకు చేరుకుంది.స్టార్ హీరో మహేష్ బాబు ఎపిసోడ్ తో అన్ స్టాపబుల్ మొదటి సీజన్ ముగియనుంది. ఇప్పటికే మహేష్, బాలయ్యల ఎపిసోడ్ సంబంధించి ప్రోమోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండగా.. ఆహా మరో స్పెషల్ ప్రోమో రిలీజ్ చేసింది. ఫిబ్రవరి 4న ప్రసారం కాబోతున్న మహేష్ ఎపిసోడ్ లేటెస్ట్ ప్రోమోలో.. బాలయ్య – మహేష్ ల సంభాషణ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మరి ఈ లేటెస్ట్ ప్రోమో పై మీరు కూడా లుక్కేసి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.